దశ ధర్మం నజానన్తి ధృతరాష్ట్ర నిబోధతాన్।
మత్తః ప్రమత్త ఉన్మత్తః శ్రాన్తః కృద్ధో బుభుక్షితః।।
త్వరమాణశ్చ లుబ్ధశ్చ భీతః కామీ చ తేదశ।
తస్మాదేతేషు సర్వేషు న ప్రసజ్జేత పండితః।।
ధృతరాష్ట్ర! ఈ చెప్పబోవు పదిమందీ ధర్మమును గూర్చి ఎరుగనివారు. వారు-
మత్తెక్కినవాడు,
పొరపాటుపడేవాడు,
పిచ్చివాడు,
అలసినవాడు,
క్రోధము గలవాడు,
ఆకలితోయున్నవాడు,
తొందరపాటుగలవాడు,
అత్యాశగలవాడు,
భయపడేవాడు,
కాముకుఢు
వీరితో పండితుడెప్పుడూ సాంగత్యము చేయరాదు.