ఒక స్వరం ఆగింది,
ఒక శరీరం నిర్జీవం అయింది.
ఒక వేదన ఎడారి పాలైంది,
ఒక ఆవేదన అరణ్యరోదన అయింది.
అనుకుంటే పొరపాటే
ఆ స్వరం అనేక గళాలకు పల్లవి అయింది
ఆ శరీరం పీడన వర్గాల గుండెచప్పుడైంది
ఆ వేదనలు జనసమూహల రాచబాట అయింది
ఆ ఆవేదనలు కోట్ల జనుల కాంతిపుంజాలు రహదారి అయింది
ఇది అక్షర సత్యం
ఆ గళం దోపిడీ దారుల గుండెల్లో చురకత్తులైయి
ఆ స్వరం బలహీనుల కలయికతో బాహుబలులై,మహాబహులను చేసింది
ఆ కలం విప్లవకారులకు దిక్సూచి అయింది
ఆ నృత్యం పాపాత్ముల పాలిట సింహస్వప్నం అయింది
ఆ రూపం అరాచక పెట్టుబడిదారీ వ్యవస్థకు శివతాండవం ఆడించింది
ఆ వ్యక్తి సమాజ శక్తి గా మారి సామాజిక సమస్య పరిష్కారానికి కృషి చేసింది
అందుకే అందుకే అందుకోవయ్యా, ఓ వంగపండు మా అంజలి దండ...
జోహార్.. జోహార్ ఓ ...వంగపండు
నీకు మరణమా??? లేదు లేదు...
రాదు రాదు... వంగపండు ..నీ వెంట
ఎన్నో ఎన్నెన్నో గళాల గలగలు వరదలు లా ఉంటాయి, నీవు
నిశ్చింతగా, నిశ్చలంగా ఆత్మశాంతిగా ఉండిపో,నీ ఆత్మకాంతి దిశదిశులుగా ప్రకాశించు గాక.....
*** చురకశ్రీ***
రచయిత, సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ ,కావలి