సృష్టి లో ప్రతి ఒకటి తనను తాను;
ఏదో ఆధారంతో ఏదో ఒక ఆకారంతో సృష్టించుకుని;
తన ఉనికిని కాపాడుకుంటూ ముందుకు పోతుంది;
అది ఏ ఒకరిచే క్షీణించుకోబడదు నశింపచేసుకోదు!
ప్రతి ఒకటి అందమైన అంశంగా మారుతుంది;
మారినట్లు తనకు కూడా తెలియకపోవచ్చు;
ఏ రవ్వంత ఆసరావున్న ఏది ఏమైనప్పటికీ;
వచ్చిన అవకాశాన్ని వదులుకోదు
మరొకరికి ఇవ్వదు!!
అది బండరాయి అయినా; కొరకరానికొయ్య అయిన ;
ఏ మాత్రం కాస్తంత దూరే మార్గం ఉంటేచాలు!
నిబ్బరంగా నిశ్చలంగా, నిశ్చయంగా ఉండిపోవడానికి!!
తనకుతానే అంబరాన్ని తాకాలని తహతహలాడి పోటీలో ఉండాలని
ఆశ పడుతుంది!
దాని మార్గం అది చూసుకుంటు ఉంటుంది;
తాను ఎదుగుతూ తను పచ్చ పచ్చగా ఉంటూ;
తన నీడను ఇవ్వాలని చూస్తూ ఉంటుంది!
తన నీడలో తన్నంత దానిని పెరగనీయదు;
ఓవేళ చిన్న చిన్న వాటిని పెరగనిచ్చినా;
అవసరమైనప్పుడు తన సత్తువకోసం ఉంచుకుని కబలిస్తుంది!!
ప్రతిదీ అంతే మానైనా మనిషైనా అంతా ఒకటే;
ప్రతిదీ అందమైనదే ప్రతిదీ అవసరమైనదే;
అది ప్రకృతి ధర్మమే సుమా;
ప్రకృతి అందమైన దృశ్యమే!
మామూలుగా చూస్తే అంతా అందంగా కానరాకపోవచ్చు;
అద్దంలో బంధించినప్పుడు దానికి అమితమైన అందం చేకూరుతుంది;
అదే ప్రకృతికి నిజమైన అందం !!
గిట్టితే బంధం ఎలాంటిదో అది కూడా అలాంటిదే;
మరి చూసే కళ్ళను బట్టి దాని తీరు ఉంటుంది ;
గిట్టకపోతే చక్కగా ఉండేదికూడా హీనమే మరి!
ఇది చురకశ్రీ వారి మాట!! స్వర్ణ కాంతిపుంజపు బాట!!!
----------------------------------------