ఓ!దేవుడా!!నీవెక్కడా?కొండకోనల్లోవెతికా!
వాగువంకల్లో ,చెట్టుచెమల్లో, గట్టుపుట్టల్లో,రాళ్ళు రప్పల్లో వెతికా;
గుడిగోపురాల్లో,మసీదు, చర్చీల్లో వెదికా!
నీటిమడుగుల్లో,నీటిగుంటల్లో ,అడవుల్లో,జలపాతాల వెంట తిరిగా; నదుల వెంటపరిగెత్తి వెతికా,పంచసముద్రల్లో వలవేసి గాలించా!!
సప్తఖండాల్లో,జల్లెడపట్టివెదికా,భూమిఆకాశాల్లో భూతఅద్దంతో వెతికా!
ఇక్కడ,అక్కడ,ఎక్కడెక్కడో వెతకని జాగాలేదు కానీ నీ జాడ కానరాలేదయ్యా!!
ఓ! దేవుడా!!నా మనసునకు నచ్చిన దేవుడా! ఎక్కడ దాగి రంభ,మేనక,ఊర్వశి, తిలోత్తమ లతో తైతక్కలాడుతున్నావా?
పరలోకసంచారివై ఉన్నావో! పరులతో పరాచకాలుఆడుచుంటివో?లోకకళ్యాణకోసం దీక్షలో ఉన్నావో?
తెలియక తికమకతో విసుగుచెంది, క్రోధంతో రౌద్రధారుఢనై పౌరుషంగా నీవు ఉంటేఎంత?
లేకపోతే ఎంత?నీవుకనబడితే ఎంత?కనబడకపోతే ఎంత?అనుకుంటూ!!
నిన్ను నేను తిట్టుకుంటూ నన్ను నేను తిట్టుకుంటూ గొణుగుకుంటూఇంటిదారి పట్టాను!
దారిలో దప్పిక దప్పిక అంటూ పిలుపు వినబడే నా దగ్గర ఉన్న కొంతనీటిని తాగించా....
తాగిన అతని ఆ చూపులో తళకు చూసా,మనసు లో దాగిన విసుగు కాస్తంత మాయం అయింది!!
మరింత దూరం వెళ్ళకా... ఓ పండు ముసలి ఆకలి అంటూ కేక వినబడే;
నే దాచిన రొట్టె ముక్కను అందించా తిన్న ఆవిడానందం చూశా... పిసరంత క్రోధం దూరమాయే!
దవుడుగా మరికాస్త ముందుకు వెళ్ళానిలువ నీడ లేక చలితో గజగజ వణుకుతూ,
జాలిగా చూస్తున్న ముదుసలి చూపు చూశా;
ఒంటిపై ఉన్న ధవళవస్త్రంతో కప్పాను ఆచూపులో ఆనందంచూసా...!
దాంతో నాలో ఉన్న రౌద్రం కాస్తంత మాయం అయ్యే!
ఇంకాస్త దూరం నడిచా నాబిడ్డలు నాచూట్టూతా చేరి అల్లారుముద్దుగా ప్రేమతో నన్ను పెనవేసుకొనే నాలో లీలమైన విసుగు ముసుగు తొలిగె !!
నాకు అప్పుడు జ్ఞానోదయం కలిగే దేవదేవుడు ఎక్కడో లేనేలేడు...!!
జనాలమధ్యల్లో దాగిఉన్నాడని తెలిసేరా ఓ హో!! "జీవుడే దేవుడ"ని
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.