భక్తి ఆత్మతత్వభావుకతలు కర్మఫలంతెలియని లేనివారికి భగవద్గీత పనికిరానిసారమే! ప్రేమత్వం;
కరుణారసాలులేనివారికిబైబిల్ కూడా అంతేనయ్యా!!
పవిత్రకర్తవ్యనిగ్రహభక్తి,దయసహయత ఆప్యాయత,
సుగుణాలు లేని వారికి ఖురాన్ గూడా ధరలో అంతే!!!
ఇదే చురకశ్రీ వారి మాట !! స్వర్ణకాంతిపుంజపుబాట!!!
---------------------------------------------------------
పిసిరంత పసి,పిరికి,పిసినారితనాలుండొచ్చులే!
కసిరెంతకరుకు,కూరత్వ,క్రోధాలుఉండవచ్చునా?సమయానకూలవీరత్వంఅవసరమే!!ఏమైనప్పటికీ మితిమీరిన మోతాదు చేటు తెచ్చున్ ధరణిలోన్!!!
ఇదే చురకశ్రీ వారి మాట !! స్వర్ణకాంతిపుంజపుబాట!!!
----------------------------------------------------------
సిరి లేనివాడు గిరిగీసుకొని గిరిలోనుండు;
సిరిఉన్నవాడు గిరగిరా తిరుగుతూ గిరిశిఖరం చేరున్;
అదిఎట్లన్నన్ నూరు రూకలు పెట్టి సిల్క చీర కట్టని ఆవిడ;
నూరునూళ్ళు పెట్టి పట్టుచీర కట్టునా ?
ఇది చురకశ్రీ సూటిమాట ! స్వర్ణకాంతిపుంజపుబాట!!
-------------------------------------------------------------
కసితో ఉసిగొల్పేవాడు ఒకండు ,మాడి మసి అయ్యేది మరొకండు;
బుసతో రెచ్చగొట్టేవాడు ఒకండు,పసిగట్టలేక బుగ్గి పాలయ్యాడు మరొకండు;
కస్సుబుస్సులు తెలుసుకుని మసలుకో చిన్నోడా!లేకుంటే అగ్గిపాలు
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
--------------------------------------------------------------
నిజాయితీ నెమ్మదిగా ప్రవహించే సజీవ నది లాంటిది;
అవినీతి వరద వచ్చినప్పుడు ఉప్పొంగే వాగు లాంటిదే;
అది ఎట్లన్నన్ క్రమంగా గోవుపాలు,శునకపు మూత్రం లాంటివే సుమా!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతి పుంజపుబాట!!
------------------------------------------------------------
నీతిగలవాడి తోడమెలుగు నీకు కలుగు మేలు,
సత్యపరుడుతో తిరుగు నీకు జరుగు సత్కారాలు,
సత్ప్రవర్తన వారితో ఉండు నీలో సత్ బుద్ధులు మెండుగా వచ్చున్;
అలా కాక గలీసు వారితో చేరినా నీవు ఎన్నటికీ పాలిష్ కాలేవు!
అది ఎట్లన్నన్ కాళ్ళజోళ్ళు చూడ ముచ్చటగొల్పు;
అంతమాత్రాన నట్టింట పెట్టజాలమా? సుమా!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
----------------------------------------------------------
పది రకాల ఆలోచనలకు పది తలలు అవసరమా?
పలురకాల పాత్రలను పోషించే స్త్రీమూర్తి ఇంట ఉండ;
పలుభారాలు మోయడానికి పదిమంది అక్కరనా?
పుణ్య పురుషుడు ఇంటా బయట ఒకడే చేయుట లేదా;
ఇరువురు ఒకటైన ఇలలో కానిది ఏమున్నది?
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
-----------------------------------------------------------
మనం అనుకుంటూ ఉంటాం అనుకున్నట్లుగా జరితే బాగుండేది అని
కాని అలా జరుగుతాయా! జరగవు! అప్పుడప్పుడు జరగవచ్చు!!
అంతమాత్రాన మనమేదో గెలిచాం అని చంకలు గుద్దుకుంటూ,
ఓడిపోయాం అని రోడ్డు మీద దొర్లడి! అల్లాడిపోతే ఎలా?
అది ఎట్లన్నన్! విశ్వవిజేత అలెగ్జాండర్ పురుషోత్తమ చేత గెలిచి!! ఓడిపోలేదా? ఇది నిక్కం కాదా?? చరిత్రలో!!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
---------------------------------------------------
నీ చేతిన జారింది వెతికిన,వెతకపోయిన నీదే అయితే;
దొరుకు లేకపోతే అది పరులకు ఉరుకు;
ఒక్కొక్కసారి నీ శ్రమే మరొక్కరికి శ్రమదానమే సుమా!అది ఎట్లన్నన్!
జఠాధరుడు గంగను తన శిరం పై ఆపిన గంగా జనగంగా కాలేదా? ఇది సత్యం కాదా??
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
------------------------------------------------