నా సిరా ఒకప్పుడు చిక్కబడింది గీత రాయడానికి వీలు లేకపోయింది
నా సిరా మరొకప్పుడు పల్చబడింది గీత గీయడానికి జారిపోయేది
నా సిరా మరిఇప్పుడు మలచబడింది (సరిదిద్దుకోవడమైంది) గీత పదునైన చురకత్తి గా మారింది
ప్రయత్నం ఒక ప్రయోగం అదే మహత్తర ప్రయోజనం
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
--------------------------------------------------------------
నా నుంచి నీవు,నీ నుంచి నేను ఏమి తెలుసుకొన్నాం,ఏం తీసుకున్నాం
నీ నుంచి నేను నా నుంచి నీవు ఏం నేర్చుకున్నావు ఏం వదులుకున్నాం
ఒకే ఒక క్షణం ఆలోచించు నీకు,నాకు ఇద్దరికీ బోధ పడుతుంది
నా నుంచి నీవు ఎంత దూరం అడుగులు వేసావు,
నీ నుంచి నేను ఎంత దూరం ప్రయాణం చేసాను
ఒకే ఒక క్షణం ఆగి ఆలోచించు అవగతం అవుతుంది
మంచి ఏదో, చెడు ఏదో నీకే తెలుస్తుంది
ముందుకు పోవడమా? ఆగిపోవడమా? అనేది తేలిపోతుంది నీలో నాలో దాగిన సంశయాలు తరలిపోతాయి.
ఇదే చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట !!
--------------------------------------------------
పైపై మాటలు కట్టి పెట్ట వోయి,లోలో గట్టిమేలు తలపెట్టవోయి
అమ్మ బాష గొప్పదని అమృతంకన్నా తీయదని
చిలక పలుకులు ఆపవోయి,ఊక దంపుడు మాటలు నిలుపవోయి
పిలుపున కమ్మదనమని ,రమణీయమని మెచ్చుకోలు మాటలు చప్పట్లు కొట్టునోయి
గురివింద నలుపు చూసుకుని మసలుకో అమలు చేయవోయి
చెప్పేవి నీతి మూటలు చేసేవి తన ప్రగతి బాటలు వోయి;ఇలా అయితే ఎలాగోయి,
అది ఎట్లన్నన్ మన ఇంటి కూర రుచికన్నా,పొరుగింటి పుల్లకూర మంచిదోయి కొందరికి;
అలాగని పరాయిబాషను కించపరచకు జ్ఞానం ఎక్కడ దొరుకునో అక్కడ చేరుట తప్పుకాదోయి,
అందుకోసం వెతుకు,
ప్రపంచం ఎటో పరుగులు తీస్తుంది దానితో పోటిపడు అంతేనోయి,
మన మాతృబాషను మరచిపోకోయి,
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
--------------------------------------------
కంటికి కనిపిస్తున్న చూడలేదు అనడం
చెవికి వినిపిస్తున్న వినబడలేదు అనడం
చేతికి స్పర్శ తెలుస్తున్న తెలియలేదు అనడం
మనస్సుకు స్పందనలు తడుతున్న ప్రతిస్పందనలు లేవన్నడం
అదొక వింత బూటకం, మహానాటకమే కాకపోతే
పసిగట్టే చతురత ఉన్న చేత కాక చతికిల పడడం పిరికితనమే సుమా!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
-------------------------------------------
నేడు నీదే కావచ్చు విర్రవీగకు గీతమారితే నీ తలరాత మారితే రేపు నీది అధోగతిగా మారవచ్చు, అలాగే ఉన్నప్పుడు తిక్కెక్కిన పనులు చేస్తే లేనప్పుడు, వీలు కానప్పుడు తోలు ఊడుట తధ్యం మహీలో
అది ఎట్లన్నన్ చెరువు నీటితో కళకళలాడుతూ ఉండు మరి ఎండినప్పుడు నేల అడుగు బీటలు తారసపడు
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!