పాల కడలి లో దాగిన సొగసైన చిన్నదాన
నీవు ఎంత దాగిన నే నిన్ను అసలు వదలనులే కుర్రదాన
నీ హృదయ సాగరాన్ని నా మది కవ్వంతో చిలికి
నీ మది నది న చల్లని వెన్ననై నిలిచిపోనా పడుచు దాన
పాల బుగ్గ లపై సిరి నవ్వుల హరివిల్లు లా విరబూసే మల్లెల సింగారమా
ఓ నా బంగారం ముచ్చటైన నీ రూపురేఖలు నాలో ఊహలు గుసగుసలాడే
దాంతో నా మనస్సు ఊగిసలాడే నిన్నే చేరాలని తొణికిసలాడే నా పరువం
నీ కంటి వెలుగులు నా నయనానందకరం అయ్యే
నీ చిరునవ్వులు నాలో అంతర్మధనం అయ్యే అలజడులు తొలగి
తొలకరి చినుకులు అయ్యే అందుకే నీవు అంటే ఇష్టం
నీవ్వే నీవ్వే కావాలని పదేపదే నా మనస్సు కోరుతూ
నీ వెంటే ,నీ చుట్టే పరుగులు తీస్తూ ఉందే నా మనసా
ఇదంతా నీవల్లే నీవల్లే అంటుందే నా ప్రాణమా
నాలో ఊపిరి ఊపి నింపే ఓ నా జీవమా
నా సంధ్యపొద్దులు నీతోనే అని మరువకు నా మరువపు పూవ్వా
ఈ గువ్వ నీ కోసమే నని నిన్ను విడిచి ఉండలేదని
నీతోనే నా జత అని లేకుంటే నా కథే వేరని
నిన్ను చేరని నా మనో కాంతి గీత వ్యర్థం నని తెలుసుకో నా పసిడిమువ్వ
నన్ను ఒడిసిపట్టుకో సన్న జాజి పువ్వా నా హృదయ స్పందనలు నీకోసం పవనతరంగ వీచికలై
కిలకిల రావాల రాగాలను ఆలాపనలు చేయు చున్నాయి హేమంత చేమంతి నీవు అలా కుదురుగా కూర్చుని ఉండిపోతే ఎలా చెప్పు
నా మనస్సు నిబ్బరంగా ఉండదే చక్కని చక్కనమ్మా
నా వయసు కుదురు అదురుతుందే నే నచ్చే మల్లి నా చెలి
రచన.సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.