నీ దారి నా దారి ఒకటే అయినప్పుడు;
ఒక అడుగు నే వెనుక వేసినప్పుడు; నా వెంట నీవు రెండు అడుగులు ముందుకు వేస్తే తప్పుఏమిటి? చెప్పు;
నా ఆలోచన నీ ఆలోచన ఒకటే అయినప్పుడు;
నాతో నీ మనస్సు పంచుకోవడానికి ఎందుకు? సంశయం చెప్పు ;
నా మనస్సు అంతా నీవే ఉన్నప్పుడు దేనికోసం నీవు తటపటాయిస్తూన్నావో? నాకైతే ఎరిక కావడం లేదు మనసా! దేనికోసం నీ నిరీక్షణ చెప్పవా!!
నీ నవ్వులు పూలజల్లు అయి నన్ను మనసారా హరివిల్లు లా చేస్తూ; నాలో ఆశల ఊపిరి నింపి
నన్ను నిలువ నీయక చేయిస్తూ ఉంటే ;
నీవు అలాగే ఉండిపోతే ఏలా? చెప్పు
నీ మౌనం నన్ను పరి పరి విధాలుగా దహించి వేస్తుంది ఎందుకు?
నన్ను ఇలా వేదనలకు గురి చేస్తున్నావు? చెప్పు
నే చేసిన తప్పు ఏమిటో చెప్పు నన్ను ఇలా ఒంటరి చేసివెళ్ళితే ;
నే ఎలా ఒంటరితనం భరించగలను చెప్పు?
నాకు నీవు కాక ఎవరైనా ఉన్నారా? అన్ని వదలి సర్వస్వం నీవే అని తలచి నీ వెంటే నడచి
నీలోనే లీనమై కడకు నీ వడిలోనే నే కన్ను మూయాలన్ని ఉన్నాను
నన్ను ఇలా వదలి నా గుండె లను పిండి నలిపేశావు
నీ రాక కోసం నేనే కాదు నా కన్నీటి చుక్కగా కూడా నీ కోసమే ఎదురు చూస్తుంటుంది
నన్ను ఇలా అలా విలపించక వచ్చాయి మనసా నా ఎద నీ ఎడబాటును తట్టుకోలేక విలవిలాడు చుండే
నీ విలాసం కోసం నా నుదుట దిద్దిన బొట్టు నిటారుగా నిఘా కాయచుండే
అయింది ఏదో అయింది ఎటూ ఉన్న ఎంతదూరం ఉన్న మనస్సులో ఏమీ ఉంచక ఆలోచించక వచ్చాయి
నీ రాక కోసం వేయికళ్ళతో ఎదురు చూస్తూ ఉంటా
నిన్ను నే బాధించి, కష్టించి ఉంటే నన్ను మనసారా మన్నించి శీఘ్రంగా రా ప్రియ ప్రాణనాధ...
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి.