ఎందులో గెలిచాం?ఎందుకు గెలిచాం?
ఉపాధిని జయించి ఆకలిని జయించినామా?
వ్యాధులను పసిగట్టి ఆరోగ్యాన్ని కాపాడినామా?
వైద్య సిబ్బందిని పెంచి వైద్య సేవలను పంచినామా?
ఆసుపత్రిలు కట్టి బెడ్లు పెంచి,ఆక్సిజన్ అందించినామా?
ఎందులో గెలిచినాము?ఎందుకు గెలిచినాము?ఎవరికోసం గెలిచినాము?
జనాలను ఇక్కట్లను తీర్చలేని తీర్పు, అది గెలుపు ఎలా అవుతుంది?
ఎవరు గెలిసిన ఒకటే,ఎవరు ఓడిన ఒకటే
దానికోసం నీకు ఎందుకు సంబరాలు
దేని కోసం ఆ కేరింతలు, నీ ఆకలి తీరదు, నీ బాధలు తొలగవు,నీ ఇక్కట్లు పోవు,నీ జీవిత ఆట నీదే, నీ జీవన పాట నీదే నీ బతుకు పోరాటం, ఆరాటం నీదే ..
రచన...సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ ( చురకశ్రీ) కావలి.