ఇప్పటి పరిస్థితి ముక్కు సూటిగా పోతే మూతి పచ్చడి అవుతుంది!
పోని వంకరటింకకరగా పోతే శ్మశానానికి దారి కానవస్తుంది!!
ఏమిటో ఈ మాయ జగత్తు!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
ఒకప్పుడు కూటికి కటకటలాడి, డీలాపడినవాడు;
మలమలమాడి కాలం,తలరాత మారి
మరిప్పుడు కోటికి పడగలెత్తి పరుగు పందెంలా ఉరుకలెత్తసాగే!!
అలాంటప్పుడు ఎవరు ఎప్పుడు మారుతారో?
ఎవరికి ఎరుక! నుదుటి రాతో,శ్రమో తిరగబడి పైచేయి కిందికి, కింది చేయి పైపైకి ఎగబాకు!!
గమనించుకో నెవరిని కించపరచమాకు,పొగరుకు పోమాకు!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!
ఎగిసిన నీటి కెరటాలు తీరానికి తాకక పోవునా!
ఎగిరిన గాలి తరంగాలు నేలను ముద్దాడాక ఆగునా!!
ఓడినవారు పట్టు సడలక పోతే గెలుపు శిరస్సున అంటదా!
గెలిచి చిందులు వేస్తే పతనం పాతాళానికి చేరదా!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!
పడే ప్రతి చినుకు మట్టి అణువును తాకి ముచ్చటైన మట్టి వాసన తెచ్చు/ వచ్చే!
పుడమి పైన పుట్టిన ప్రతి మొక్క జీవులకు ఏదోరకంగా ఉపయుక్తం కలిగించు!!
కణ జీవం ఉన్న జీవి పలువురికి ఉపయోగపడని జన్మ వ్యర్ధం కదా! ధరణీ నందున్!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!
మట్టి దిబ్బ పై నీటి బుగ్గ;
మేము చేరేది ఎలా అబ్బా!
చేతిలో బుంగ /డబ్బా నిండేది ఎట్లా? అదే బెంగ
ఎగరడానికి రెక్కలు లేవు అబ్బి!!
ఎలా వేశారో? ఆ ఎత్తులో ;
వేసిన వాడిచేతిలో మహత్తు!
తెచ్చుటలో తాహత్తు ఉండాలి అబ్బి!!
అదొక మహా స్తూపం నేటి చరిత్రకు సాక్ష్యం!
నేటి శిల్పులకు అక్షర రూపం!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!