నీలాగ నేను లేను;
నాలాగ నువ్వు లేవు;
నీ రూపం అపురూపం;
నా రూపం అంతకంటే గొప్పదే!
నీ అందం మహానందన సుందరం;
నా అందం మైమరచే మకరందం;
నీ హృదయం అమృత కలశం;
నా హృదయం సుగంధ పరిమళం!!
నీ పలుకులు/ స్వరాలు "సరిగమపదనిస"ల మకరందపు తియ్యదనం;
నా పలుకులు సరితూగే మకరందపు తియ్యదనపు నాద స్వరాలు!
నీ నడకలు హంసపాద,మయూర శృతిలయల సమ్మేళనం;
నా నడకలు సింహ స్వారీ విహారం!!
నీ నడత సున్నితమైన విశాల ప్రశాంత ప్రకృతిమయం!
నా నడత నీ అడుగుజాడల సమస్తమయంపు సమూహం!!
మరి నీ మనస్సు తేనెలొల్లికే కమ్మదనం!
మరి నా మనస్సు నిన్ను అల్లుకున్న మధురమైన సువాసన వెదజల్లే పూలతీగ!!
అందుకే నీ వెంట నేను,
నా వెంట నీవు!
అందులకే మన బంధం! విడదీయని జన్మజన్మల ప్రేమబంధమే!! నా ప్రియ సఖీ! మనసంగమం లోక కళ్యాణ మహోత్సవం నా ప్రియమహిత వర్షణీ!!
రచన...సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.