జనవరి 26
గణతంత్ర దినోత్సవం
మన దేశానికి రాజ్యంగము వ్రాయడానికి 7 గురు సభ్యులను ఎన్నుకోవడము జరిగింది ఆ 7 గురిలో డా.బాబాసాహేబ్ అంబేద్కర్ గారిని చైర్మేన్ గా నియమించారు....
మిగతా  సభ్యుల వివరాలు
1...అల్లాడి క్రుష్న స్వామిఅయ్యర్
2...కే.యమ్ మున్షి
3. యన్.గోపాలస్వామి అయ్యమగార్
4.మహమ్మద్ సాదుల్లా
5.యన్ మాధవిమీనన్ 6.డి.పి.ఖైతాన్...
రాజ్యంగ రచనా పూర్తిగా అంబేద్కర్ మీదనే బారము పడింది ఎందుకంటే ఇద్దరు సబ్యులు యితర దేశాల కార్యకలాపాలో మునిగి పోయారు....
ఇంకోకరు అనారోగ్య కారణాలవల్ల,మిగతావారు కాంగ్రేస్ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు అందుచేత అంబేద్కర్ ఒక్కరి మీదనే బారము పడ్డము వల్ల ఆయన అనా రోగ్యము తో భాదపడుతునే అయనకు అప్పచేప్పిన భాద్యతను పూర్తిచేసి 1949 నవంబర్ 26 న అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్,ప్రదాని నేహ్రుకు అందచేయడము వారు ఆ రాజ్యంగ ప్రతిని అదే రోజు ఆమోదించడము జరిగింది ....
ఈ రాజ్యంగాన్ని జనవరి 26 ,1950 నుండి అమలు చేసారు...
భారత రాజ్యాంగం...మన దేశానికి పవిత్ర గ్రంథం. దేశభక్తి గురించి, నినాదాల గురించి, స్వేచ్ఛ గురించి ఎన్నిరకాల అభిప్రాయాలున్నా… అన్నిoటికీ రాజ్యాంగమే ఆదర్శం.... భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది కాబట్టే రాజ్యాంగం అంటే అందరికీ అంత గౌరవం....అలాంటి రాజ్యాంగానికి కర్తకర్మ అన్నీ అంబేద్కరే.... స్వతంత్ర భారతదేశం భవిష్యత్ కు దిక్సూచిగా తన ఆత్మనే రాజ్యాంగ గ్రంథంగా రాసుకున్నారు అంబేద్కర్..... భారతజాతికి ఆయన ఇచ్చిన ఈ బహుమతి మతాలు, కులాలు, వర్గాలన్నిటినీ ఏకంగా చేసింది. ఏ తేడా లేకుండా ప్రతి పౌరుడికీ సమానమైన గుర్తింపు ఇచ్చింది. అందుకే అంబేద్కర్ అందరివాడయ్యారు....
అంబేద్కర్ ఆలోచనలే భారతీయులందరి ఆత్మగౌరవం.... అందుకే తరాలుగా అట్టడుగున ఉండిపోయిన ప్రజలకు ఆయన దేవుడు. ఆయన ఆలోచనలను కాదనేవాళ్లకు కూడా ఆయనే ఆదర్శం. అందరికీ కలిసి ఆయన శాశ్వత అవసరం. ఆ అవసరం అనివార్యంగా మారడానికి కారణం… మన రాజ్యాంగం. ఏ భేదం లేకుండా… భారత ప్రజలమైన మేము… అంటూ మొదలవుతుంది మన రాజ్యాంగం. ఈ ఒక్క మాటతో భారత నేలపై ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే అని చెప్పారు అంబేద్కర్. అప్పటికే కులాలుగా, మతాలుగా విడిపోయిన భారతీయులను ఒకే ఒక్క మాటతో ఒక్కటి చేశారు. ఈ సమానత్వంతోనే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు...
స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో పాలన వ్యవస్థ ఇంకా నిర్మాణం కాని క్లిష్టమైన వాతావరణంలో మన రాజ్యాంగ రచన జరిగింది. దీనికి రచనా కమిటీ ఛైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంతకంటే ముందు ఆయన్ను అసలు రాజ్యాంగ సభకే వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాయి అప్పుడున్న కొన్ని పార్టీలు.... కానీ భారతజాతికి దిశను చూపించే రాజ్యాంగ రచనకు అంబేద్కర్ మాత్రమే సరైనవ్యక్తి అని నాటి సభ్యులు  చెప్పడము జరిగింది .... తర్వాత రాజ్యాంగ రచన మొదలుపెట్టారు.
మనదేశం కంటే ముందే చాలా దేశాలు రాజ్యాంగాలు రాసుకున్నాయి....అలా 130కి పైగా దేశాల రాజ్యాంగాలను చదివారు అంబేద్కర్. అవన్నీ అధ్యయనం చేసి మనకు అవసరం అనుకున్నవి, మన దేశ పరిస్థితులకు తగినట్టుగా మార్పులు చేశారు....
 మనదేశంలోని రకరకాల సమాజాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందో చాలా ముందుగానే అంచనా వేసి… వాటికి పరిష్కారాలు చూపించేలా రాజ్యాంగ రచన చేశారు అంబేద్కర్....
దేశంలో పటిష్ఠమైన వ్యవస్థల్ని నిర్మించేలా రాజ్యాంగంలో నిర్దేశించారు అంబేద్కర్. ఏ వ్యవస్థ తప్పు చేసినా మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దేలా అద్భుతమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఏ వర్గాన్నీ పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా చేశారు. పాలకులు దారితప్పితే ప్రజలు ప్రశ్నించే హక్కు ఇచ్చారు. హక్కులతో పాటు ప్రభుత్వాలను గైడ్ చేసేలా ఆదేశిక సూత్రాలను ఇచ్చారు. మనకంటే చాలా ముందుగా రాజ్యాంగం రాసుకున్న అమెరికా వ్యవస్థ కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించలేకపోయింది.... కొన్ని పరిష్కారం లేని సమస్యల్ని సృష్టించింది. కానీ మన రాజ్యాంగం భవిష్యత్ ను చాలా ముందుగా ఊహించి పరిష్కారాలు చూపేలా రచించారు అంబేద్కర్....
కొన్ని దేశాల్లో పన్ను కట్టేవాళ్లే ఓటర్లు. కొన్ని దేశాల్లో ఇంకొన్ని అర్హతలున్నవాళ్లకే ఓటు. వాటన్నిటికీ భిన్నంగా… దేశంలో ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించారు అంబేద్కర్. టాటా, బిర్లా అయినా… రోజు కూలీ అయినా ఓటుకు ఒకటే విలువ. ఇదే అంబేద్కర్ ప్రతిపాదించిన అసలైన ప్రజాస్వామిక సిద్ధాంతం....
అంబేద్కర్ న్యాయశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు.... మనదేశంలో సామాజిక వివక్ష ఎలా ఉంటుందో, ఎదగడానికి ఎన్ని కష్టాలుంటాయో ఆయనకు బాగా తెలుసు. అందుకే పౌరహక్కుల విలువను బాగా అర్థం చేసుకున్న వ్యక్తిగా… వాటిని రాజ్యాంగంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. వాటిని ఎవరూ కాదనే అవకాశం లేకుండా తిరుగులేని రక్షణ కల్పించారు. ప్రజల చుట్టూనే వ్యవస్థ పనిచేసేలా చేశారు. ప్రతి పౌరుడూ తన ఆలోచనలు చెప్పుకోగలిగేలా భావప్రకటనా స్వేచ్ఛను ఇస్తూ ఆర్టికల్ 19 రూపొందించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రాథమిక హక్కుల్ని పార్లమెంట్ కూడా ఉల్లంఘించే పరిస్థితి లేకుండా చేశారు అంబేద్కర్....
దేశంలో మత, కుల, లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛనిస్తూ దాన్ని రాజ్యాంగబద్ధం చేశారు బాబా సాహెబ్. అర్టికల్స్ 14, 15, 16లలో సమానత్వ హక్కులు కల్పించారు. ఇవే దశాబ్దాలుగా దేశంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రక్షణకవచాలుగా నిలుస్తున్నాయి.
దేశంలోని ప్రజలకు తిండి, బట్ట, ఉద్యోగం ఇవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలపైనే పెట్టారు అంబేద్కర్. అందరికీ సమాన అవకాశాలుండాలని చెప్పారు. మహిళలకు రాజకీయ స్వాతంత్ర్యం ఉండాలని చెప్పిన అరుదైన నేత అంబేద్కర్. దళితుల కోసం మాత్రమే కాదు దేశంలోని అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన అసమాన నాయకుడు బాబా సాహెబ్. అంబేద్కర్ ను చదవకుండానే ఆయన్ను దళిత నాయకుడిగా ముద్రవేసిన చాలామందికి ఆయన చెప్పిన సమానత్వం ఎప్పటికీ అర్థం కుండానే ఉండిపోయింది.
దేశంలో ఎన్ని మతాలు, కులాలు, జాతులు, భాషలు ఉన్నా భారతజాతి సమైక్యతను,సమగ్రతను కోరుకున్నాడు  బాబాసాహెబ్ అంబేద్కర్ గారు....
ప్రాథమిక హక్కుల పరిపూర్ణ తత్వానికి  ఆదేశిక  సూత్రాలు జీవనాధారంగా  ఉన్నపుడే  సంక్షేమ రాజ్యం సాధ్యం అవుతుంది ... 
ఐక్యరాజ్య  సమితి (UNO) పౌరుల  ఎదుగుదల వారి వికాసము  అవిభాజ్యము అనుఉల్లంఘనీయమైన  " మానవ హక్కులు "  అని ప్రకటించడానికంటే ముందే ఈ ఆదేశిక  సూత్రాలును  రూపొందించిన  ఘనత  అంబెడ్కర్ గారికీ చెల్లుతుంది  ..
డా: బి .ఆర్.అంబేద్కర్ .మీ బరిగల శివ జై భీమ్ టీవీ ఫౌండర్&చైర్మన్.....🙏🙏🙏🙏
KING OF INDIAN CONSTITUTION..