నే కోరేది!!
##########
అది అదిగో; అల్లదిగో " 0" గంటల నిశ్శబ్దం;
ఒకే ఒక సెకన్ చప్పుడు! కేకలు; కేరింతలు ;కేకుల కోతలు,చేతుల ఊపులు!! ఫోన్లలో పలకరింపులు, వాట్స్ అప్ ల పోస్టింగులు;
టపాసుల మోతలు ఒకటే గ్రీటింగ్‌లు చాటింగులు ! భళేభళే మిఠాయిల కటింగీలు ఈటింగులు !! ఒకటే పరుగులు,మహా మీటింగులు కోలాహలాలు! హత్తుకోవడాలు,నెట్టుకోవడాలు; ఇలాఇలా ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో వెరైటీలు!!
కాసేపే.......అయినా?
పాత చేదు చస్తూందా?కొత్త తీపి వస్తుందా?
గతాన్నికి మందులేదు, మరణంలేదు, రాదు!
గతం ఎన్నటికీ మాయని మచ్చే; నీకు నచ్చకపోయిన మచ్చే!!
గతంలో నీ చే చేయబడ్డ నీచాని ,వదలై ఓ! జీవా !!
సన్మార్గంలో నడిచే దారి చూసుకో; వెతుకు! నీవు తినే మెతుకు మంచిదో? కాదో? పరిశీలన చేసుకో !
సంబరాలతో చిందులు వేస్తూ స్వాగతలు పలికితే అది ఆత్మ బలే!! అందుకే నీవు మారడానికి ప్రయత్నం చేయి !
సంవత్సరం వస్తుంది !పోతుంది!! కాల మనే పుస్తకాన ఒక పేజీ మార్పు వస్తుంది! కాలం పెరుగుతుంది!!
నీ జీవిత కాలం తగ్గుతుంది! నీ జీవన గమనం మార్చు; నీ జీవితం మారుతుంది!!
ఉన్నంత కాస్తంత కాలంలో నీలో వచ్చే మార్పు అదే కొండంత మలుపు! (బోయవాడు)వాల్మీకి మారలేదా? గౌతముడు మారలేదా? అశోకుడు మారలేదా? మొహమ్మద్ మారలేదా? జ్ఞానోదయం కాలేదా? అలాగే నీవు మారాలి !
నీతోపాటు అందరూ మారాలి; సంబరాలు చేయాలి !!
ఓ ఈశ,ఓ అల్లాహ్, ఓ ఏసా ,ఓ బుద్ధా,పేరు ఏదైనా నీవు ఒకడవే! అదే నీవు సృష్టి కర్తవు, సకలజీవకోటికి నీవే మార్గనిర్దేశకుడవు!!
అందరిలో ప్రేమ, జాలి,కరుణ,దయ ప్రసాదించి ఆప్యాయత పెంచు,పంచు! ఇదే! ఇదే!! ఇరవై ఇరువదిఒకటి కైనా! మరిదేనికైనా!! నే కోరేది!!
అందరి ఆరోగ్యాలన్ కాపాడి ఆయుష్షు పెంచు! సర్వమానవాళిని కాపాడు ! ఓ ..నా విశ్వవిధాత!! అదే నే కోరేది!!
#######################
అందరికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు..... మీ చురకశ్రీ...
రచన...సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.
"నూతన సంవత్సర "సందర్భంగా 01-01-2021.