సంసారం ఓ పండు వెన్నెల రేయిలా ;
ప్రేమానురాగాలు గుండెల్లో నిండగా;
అందమైన ముద్దుగొమ్మ చీరకొంగు
తెరచాపై!
ముచ్చటైన జతగాడు తెడ్డులా తోడైతే!!
అలల తాకిడి ఎదురీత అయిన తడబాటు ఉండక;
యడబాటు గమనం లేక జీవిత పడవ ప్రయాణం సాగునులే!
అణువు అణువున అణుకువ ఉన్న తణుకు బెణుకులు లేక ఆగదులే జీవిత నౌక!!
ఒడిదుడుకులు వచ్చినా పొరపచ్చలు వచ్చిన మచ్చికతో చేయునులే సంసారం!
ఏ ఒకరు అలిసి సొలిసిన ఒకరినొక్కరి ఆసరాతో అలుపు సొలుపులేక ఒదిగిపోదురులే కుటుంబ సాగరానా!!
బరువు బాధ్యతలు భారం కావు లే
ఆటపాటలతోమున్నుముందుకు సాగేనులే !
తీరం ఏదైనా ఆలుమగల బంధం ఒకటేలే;
అదే ఆధారం! మహత్తర దారం ఒకటై
కష్టాల కడలిని దాటవేయునులే!!
పెను గాలులు వీచిన,జడివానలు కురిసిన !
ఓర్పుతో, నేర్పుతో ,కలుపు గోరు లతో
ముసిముసి నవ్వుల హరివిల్లు చెందునులే!!
చెల్లాచెదురుగా చెందరు లే, చల్లగా ఉందురులే! నూరేళ్ళ పంటగా!! ముచ్చటైన మురిసే జంటగా !!! హాయి హాయిగా !!!
కలిమిలేములు కావిడికుండల్లా సరిగమపదని స ల సరస విలాసాలా సాగేనులే సంసారం ...సంసారం
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.