వదలకు వదలి వదలి వెళ్ళమాకే;
కదలకు కదలి కదిలి కదలమాకే;
జారమాకే జారిపోకే చేయి జారిపోకే ఓ నా జూలీ!
నా యద వీణ తీగ తుంచకే ఓ నా నెరజాణ!!
ఓ నా చెలి !నా కళ్లలోకన్నీరునింపమాకే ఓ నా అనార్కలి!!
నా గుండెల్లో అగ్గి శోక మంట గోలి పెట్టమాకే ఓ నా లైలా!
శ్వాస ఆడక ఊపిరి ఆగిపోతుందియే ఓ నా ఊపిరి !!
నిన్ను వదలి నేనుండ లేనే ఓ నా ప్రియ సఖి!
నీవు కనబడకపోతే;
నా మనసు విలవిలలాడేనే ఓ నా లతాంగి!!
ఇక నీవు నన్ను వదిలి కదిలి వెళ్ళితే నా పాదాలలో వణుకే వణుకు అందుకే వెళ్ళమాకే ఓ నా కోమలి!
నేనుఉండగలనా?చెప్పవే ఓ నా మనసా...!!
ఏ పొరపచ్చలు లేక కలిసిమెలిసి మెదిలిన మనం యడబాటు అవసరమా? ఓ నా ఆణిముత్యం!
ఏం జరిగిందని నా నుంచి నీ దూరం ;
నాపై నమ్మకం లేకనా ? మాటకోసం ప్రాణం ఇస్తానే ఓ నా ప్రాణేశ్వరీ !!
నాలో ఆవేశమా? యిసుమంత లేదే ఓ నా వయ్యారి!
నీపై నే దాచినప్రేమను విడిచి దహించకే;
నే ఉండలేను ఓ నా బంగారం!!
నీ దరి లేని నేను విలువలేని కాసునే
అందుకే నీవు నేను త్రాసు లా! ఉందాంలే ఓ నా సింగారి.....!!
నీవు నేను జతగా ఉంటే హోలీ! ( రంగేళి) ఓ నా మనోహరిణీ!!
రచన...సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.