టీఏంసీలు, క్యూసెక్లు అంటే…
Share Tweet Pin Mail
ఇది వర్షాకాలం ఆనకట్టలలోకి నీరు వచ్చి చేరే సమయం….ఈ నేపథ్యంలో టీఏంసీలు, క్యూసెక్కులు అంటే ఏమిటో తెలుసుకుందాం. నీళ్ళను టీఎంసీలలో, క్యూసెక్లలో కొలుస్తారని మనకు తెలుసు. కానీ, వాటి పరిమాణం ఎంతో అర్థం కాదు. నిల్వ ఉన్న నీటిని టీఎంసీలలో, ప్రవహించే నీటిని క్యూసెక్కులలో లెక్కగడతారు. గోదావరి నుంచి 1.5 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదిలారు అని పేపర్లలో చదువుతాము. కానీ ఎంత నీరు వెళ్ళిందనే అంచనాకు రాలేము.
∇ ఒక క్యూసెక్కు అంటే 28.3 లీటర్లు
∇ ఒక రోజంతా 11,000 ఘనపుటడుగుల నీరు వచ్చి చేరితే అది ఒక టీఎంసీ అవుతుంది.
∇ టీఎంసీ అంటే శతకోటి ఘనపుటడుగుల నీరు (థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్స్)
∇ ఒక టీఎంసీ అంటే 2831 కోట్ల 68 లక్షల 46 వేల 592 లీటర్ల నీరు.
అంటే 2831 హెక్టార్లలో ఒక మీటరు ఎత్తున నీటిని నిల్వ చేస్తే అదొక టీఎంసీ అవుతుంది.
హైదరాబాద్ నగరంలో ఉన్న 70 లక్షల జనాభా 15 రోజుల పాటు ఉపయోగించే నీటితో సమానం ఈ ఒక టీఎంసీ నీరు. నాగార్జున సాగర్ డ్యామ్ కెపాసిటీ 400 టీఎంసీలు.