Indian Railway Bogies Code
Do You Know What These Numbers Mean On Train Coaches? The Secret Of Indian Railways’ Train Numbering System Revealed Here! Check Out Details
రైలు బోగీ నంబర్లు.. అర్థం తెలుసుకోండిలా..
భారతీయ రైల్వేలో ప్రతిరోజు లక్షల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వేస్టేషన్‌కు వెళ్లిన సమయంలో ప్రతి ఒక్కరూ రైలు నంబరు, ప్లాంట్‌ఫాం నంబర్ అనే విషయాలపైనే దృష్టి పెడతారు. అయితే మనం ప్రయాణించే రైలు ప్రతి బోగీపై ఓ నంబరు ఉంటుంది. దాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ, దీనిని ఎందుకు నమోదు చేశారని ఆలోచించం. కొందరూ దానిపై దృష్టి ఉంచినా సమాచారం తెలియక పెద్దగా పట్టించుకోరు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైలు బోగీపై 14294 అనే నంబరు ఉంది. దీని అర్థం ఏమిటంటే ముందు ఉన్న రెండు నెంబర్లు బోగీ తయారైన సంవత్సరాన్ని సూచిస్తాయి. దీనిలో 14 తీసుకుంటే 2014లో బోగీ తయారైందని భావించాలి. చివరి మూడు అంకెలు ఏ బోగీని ఎలా సూచిస్తాయో తెలుసుకోవచ్చు.నంబరులోని చివరి మూడు అంకెలు ఇలా తెలుపుతాయి..
దీనిని బట్టి పైన చెప్పిన 14294 అనే నంబరులో 14 బోగి 2014లో తయారైనట్లు.. 294 అనే నంబరు ప్రకారం స్లీపర్ సెకండ్ క్లాస్ అని తెలుసుకోవచ్చు.
- 001 నుంచి 025 మధ్యలో ఉంటే ఆ బోగీ ఏసీ(ఫస్ట్‌క్లాస్) అని అర్థం.
- 025 నుంచి 050 మధ్యలో ఉంటే ఫస్ట్ ఏసీ
- 050 నుంచి 100 మధ్యలో అయితే ఏసీ టు టైర్
- 101 నుంచి 150 మధ్యలో ఉంటే ఏసీ త్రీ టైర్
- 151 నుంచి 200 మధ్యలో ఉంటే ఏసీ ఛైర్ కార్
- 201 నుంచి 400 మధ్యలో ఉంటే స్లీపర్ సెకండ్ క్లాస్
- 401 నుంచి 600 మధ్యలో ఉంటే జనరల్ సెకండ్ క్లాస్
- 601 నుంచి 700 మధ్యలో ఉంటే జనశతాబ్ది చైర్‌కార్
- 701 నుంచి 800 మధ్యలో ఉంటే సిట్టింగ్ కమ్ లగేజీగా గుర్తించాలి.