కంపెనీ (ఫారం) కోళ్లు పెట్టే గుడ్లలో జీవం ఉండదు. అయితే ఫారం కోడిపిల్లల్ని పత్యేక పద్ధతిలో మొదటి తరం గుడ్ల నుంచి సాధిస్తారు. అలా వచ్చిన తెల్లని కోడిపిల్లల్ని ఫారం హౌస్‌లలో తిండి పెట్టి బాగా పోషిస్తారు. వీటిని మాంసం కోసం, గుడ్ల కోసం వాడతారు. కోడిపుంజు ప్రమేయం లేకుండా సాంకేతికంగా ఉత్పత్తి చేసే ఈ గుడ్లలో ఫలదీకరణం జరగదు. పైగా ఆ గుడ్ల జన్యునిర్మాణాన్ని మార్చి సంతానాన్ని ఇవ్వని విధంగా నిర్దేశిస్తారు. కనుక వాటిని నాటుకోడి పొదిగినా, ఇంక్యుబేటర్‌లో పొదిగినా పిల్లలు రావు. అందుకనే ఫారం కోడిగుడ్లు శాకాహారంతో సమానమని చెబుతారు.