1.
అవయవ హీనుని సౌంద
ర్యవిహీను, దరిద్రు, విద్యరాని యతని సం
స్తవనీయు, దేవు, శ్రుతులన్
భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా!
*భావం:*
ఓ కుమారా! వికలాంగులను, అందవిహీనులను, ధనహీనులను, విద్యావిహీనులను, గౌరవింపదగినవారిని, భగవంతుని, వేదాలను, నిందించరాదు. నిందించడం తగనిపని.