✍✍నేడు *జై భీం* పద సృష్టికర్త జయంతి ✍✍
*బాబు. ఎల్. ఎన్. హరదాస్*
(Jan 06,1904 - Jan 12, 1939)
తాను బ్రతికిన 35 సంవత్సరాల అతి తక్కువ జీవిత కాలంలో దళిత ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన నిజమైన అంబేద్కర్ అనుచరుడు.
17వ ఏట దళితుల సమస్యల చర్చించడానికి "మహారథ" పత్రిక మొదలు స్థాపించి, తన 18వ ఏట దళితుల మీద జరుగుతున్న దాడులనుండి ఆత్మరక్షణ కోసం మహర్ యువకులతో "మహర్ సమాజ్ పాతక్" అనే స్వఛ్చంద దళాన్ని ఏర్పాటు చేసిన దళిత వీరుడు..
దళితుల విధ్య అంటే చాలా కష్టమైన ఆ రోజుల్లోనే మెట్రికులేషన్ పూర్తి చేసి, "రాత్రి బడులు" "చోకమేళ లైబ్రరీలు" తెరిచి దళితుల మహిళల విధ్య కోసం కృషి చేసారు.. దళిత కార్మికులు అధికంగా ఉన్న బిడీ ఫ్యాక్టరీలలో మోసాలకు వ్యతిరేకంగా కార్మికులను వ్యవస్థీకృతం చేసేందుకు "బీడీ కార్మిక్ సంఘ్" పేరుతో సహకార వ్యవస్థను ఏర్పాటు చేసిన కార్మిక నాయకుడు..
దళితులు కులాలుగా విడిపోయి ఉండడాన్ని వ్యతిరేకిస్తూ తరచూ సామూహిక భోజనాలు ఏర్పాటు చేస్తూ., ప్రతి సంవత్సరం "సంత్ చోకమేళ"( 14వ శతాబ్దాపు దళిత సాధువు) నాడు దళితుల సామూహిక కార్యక్రమాలు నిర్వహించిన ఐక్యతావాది.
@ *హరదాస్ - అంబేద్కర్* @
రెండవ రౌండు టేబిల్ సమావేశంలో(1930-31), అంబేద్కర్ ను అడ్డుకోవడానికి హరిజన తోలు కప్పుకుని వెళ్ళిన గాంధీ వలన దళితుల ప్రతినిధి ఎవరన్న ప్రశ్న తలెత్తినపుడు..
" *అంబేద్కర్ మాత్రమే మా ప్రతినిధి* " అంటూ దేశ నలుమూలల నుండి వివిధ రాష్ట్రాల దళిత నాయకులతో 32 టెలిగ్రాముల, అప్పటి బ్రిటీషు ప్రధాని రామ్సే మెక్ డొనల్డ్ కు పంపేలా కృషి చేసారు..
తరువాత జరిగిన పూనా ఒడంబడిక సమయంలో గాంధీతో జరిగిన చర్చల్లో కూడా ఈయన క్రియాశీల పాత్ర పోషించారు...
ఇండిపెండెంట్ లేబర్ పార్టీకి చీఫ్ సెక్రటరీగా, సెంట్రల్ ప్రావిన్స్ మరియు బిరార్ ప్రాంతీయ ఇన్చార్జ్ గా పనిచేసిన ఈయన 1937 ఎన్నికల్లో ILP టికెట్టుతో కాంప్టీ నియోజకవర్గం (పూణె దగ్గర) నుండి ఎన్నికయ్యారు..
తన 35వ ఏట, జనవరి 12, 1939 న, టి.బి (Tuberculosis) వ్యాధి వలన పరినిర్వాణం చెందారు..
@హరదాస్- జై భీమ్@
దళిత ఉద్యమాలను కొత్తపుంతలు తొక్కించిన అంబేద్కర్ కు తమ విజయాలను ఆపాదించే క్రమంలో మాతృస్వామ్యాన్ని ప్రతిబింభించే విదంగా "జై రమా పత్ని" ని వాడేవారు.. ఎన్నికల్లో గెలిచాక ఒకరినొకరు పలకరించుకుని అభినందనలు తెలుపుకునేందుకు ఈ పదాన్నే వాడేవారు..
"సలాం అలైకుం" కు ఒక ముస్లిం మౌళ్వి చెప్పిన అర్థంతో ప్రేరణ చెందిన హరదాస్ అదే ఉద్దేశ్యంతో "జై భీమ్" ను వాడాలని నిర్ణయించారు... అందుకోసం ఆయన " భీమ్ విజయ్ సంఘ్" ఏర్పాటు చేసి ఆ పలకరింపు ఒక ఆనవాయితీగా అలవాటయ్యేందుకు కృషి చేసారు..
*జై భీమ్* అనగా పాళీ భాషలో .. *వివేకవంతుడా!!! నీకు విజయం కలుగుగాక*
1818 జనవరి1 న ,పూణేకు సమీపంలోని భీమానది ఒడ్డున కోరేగావ్ గ్రామంలో 500 మంది మహర్ సైనికులు, ఆత్మగౌరవం కోసం 5000 మంది బ్రహ్మణ సైనికులను చిత్తుగా ఓడిస్తే,ఆ విజయాన్ని చరిత్రలో వక్రీకరించిన కుట్రను బట్ట బయలుచేసి , ప్రతి సంవత్సరం
జనవరి1న ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ వీరులను శ్రద్దాంజలి ఘటించిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్పూర్తితో భీమ్ అనే పేరు వెలుగులోకి వచ్చింది.
దళిత ఉద్యమాలకు ఒక తిరుగులేని ఆత్మ గౌరవ నినాదాన్ని బహుకరించిన బాబు హరదాస్ కు ఈ సందర్భంగా
*జై భీములు* తెలియజేసుకుందాం...
మన ఆత్మగౌరవ నినాదాన్ని ఎలుగెత్తి చాటుదాం... గర్వంగా చెబుదాం...
జై_భీమ్! జై భీమ్!! జై భీమ్ !!!
*జై భీమ్* లతో
రాజగోపాల్ పామల
Spsr నెల్లూరు