🌸🌸🌸🍂🍂🍂🌸🌸🌸
శ్లో: జకారో జన్మ విచ్చేదః పకారః పాపనాశకః
తస్మాజ్ణప ఇతిప్రోక్తో జన్మ పాప వినాశకః
*అర్థం* :--“జ” కారము జన్మ నాశనమును, అనగా మోక్షమును, “ప” కారం పాప నాశనమును సూచించును. పాపములను నశింప చేసి, జానన మరణములు లేకుండా చేసి, మోక్షం ప్రాప్తింప చేయునదని పెద్దల ఉవాచ.
*జప మహిమ:*
శ్లో: యక్ష రక్షః పిశాచాశ్చ గ్రహాః సర్వేచ భీషణాః
జాపినo నోపసర్పంతి భయభీతాః సమoతతః
*అర్థం* : దశ దిక్కుల యందుంధెడిడి భయంకరమైన గ్రహములు, భూతములు, ప్రేతములు, పిశాచములు, యక్షులు, రాక్షసులు, మొదలైన సర్వ భూతములునూ, భయ కoపితులై, ప్రతి నిత్యము జపము చేయు వారాలను సమీపింప జాలవు.
శ్లో: జపేన పాపం శమయే దశేషం
యత్తత్కృతమ్ జన్మపరo పరాసు
జపేన భోగాన్ జయతేచ మృత్యుం
జపేన సిద్దిo లభతే నముక్తిo !
*అర్థం:* అనేక జన్మములనుండి ఆర్జింపబడిన పాపములన్నియు, భాగవన్నామ జపము వలన నష్టమై పోవును. జప మహిమా వలన అనేక భోగములతో సుఖించుచుండును. జపము వలన మరణం లేకుండా పోవును. జపము వలన అణిమామహిమాద్యనేక సిద్దులు లభించును. జపము వలననే నిత్యానంద దాయకమైన మోక్షము కూడా లభించును.