నాలుగు దిక్కులా నీరున్న భూభాగాన్ని ద్వీపం ('Island) అంటారు. ద్వీపాలనేవి రెండు రకాలుగా ఏర్పడతాయి. కాలక్రమములో ప్రధాన ఖండమునుండి విడిపోయిన చిన్న భూభాగము ద్వీపం గా తయారవుతుంది. లోతట్టు భూమికి మధ్యలో వున్నభాగము సముద్రమట్టం పెరిగి మునిగిపోతే ఒక ద్వీపం ఏర్పడవచ్చు. సముద్రములోని అగ్నిపర్వతాలు బద్దలైనపుడు పైకి ఎగిసిపడిన లావా నెమ్మదిగా ఒకచోట పేరుకుని ద్వీపం గా రూపు దిద్దుకుంటాయి. ప్రధాన నదులు సముద్రములోకి తెస్తున్న ఇసుక మేట వేయడం ద్వారా కూడా కొత్త ద్వీపం ఏర్పడుతుంది.
శ్రీలంక ద్వీపము కాలక్రమేనా భారత ఖండము నుండి విడిపోయినదే.