✳ప్రయాణం చేసే ప్రతి సారీ కాకపోయినా సాధారణంగా వేసవిలో ఈ సమస్య కనిపిస్తుంది. వేసవిలో బయటకు వెళ్లినప్పుడు పరిసరాల్లోని వేడిమికి పెన్ను గురవుతుంది. పెన్ను పైభాగం, రీఫిల్ మొదలైనవి ఘనపదార్థాలైనా, ఇంక్ మాత్రం ద్రవ పదార్థమని తెలిసిందే. ఉష్ణోగ్రతకు గురయినప్పుడు ఘనపదార్థాల కన్నా, ద్రవ పదార్థాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. కాబట్టి పెన్ను పైభాగాల కంటే రీఫిల్లో ఉండే ఇంకు ఎక్కువగా వ్యాకోచిస్తుంది. వ్యాకోచించిన ద్రవానికి సరిపడ స్థలం రీఫిల్లో లేకపోతే అది సన్నని సందుల ద్వారా బయటకి వస్తుంది. పలుచని సిరాతో పనిచేసే ఫౌంటెన్ పెన్నులు కూడా ఇలాగే కక్కుతాయి.