ఏ సముద్రంలోని నీరైనా ఉప్పగానే ఉండడానికి కారణం ఆ నీటిలో ఉప్పు ఉన్నందువల్లనే. అయితే ఆ ఉప్పు ఎక్కడిదో చూద్దాం. ఉప్పు నీటిలో కరుగుతుంది కదా. వర్షం నీరు భూమిపై పొరల్లో ఉండే ఉప్పు, ఇతర ఖనిజ లవణాలను నదుల్లోకి మోసుకుపోతుంది. ఆ నదులు వాటిని సముద్రాల్లోకి చేరుస్తాయి. సముద్రాల లోని నీరు సూర్యరశ్మిలోని ఉష్ణశక్తి వలన నీటి ఆవిరిగా మారి, భూమిపై వాతావరణంలో మేఘాలుగా మారుతుంది. ఆ మేఘాలలోని నీరే వర్షించి తిరిగి భూమిపై పారి లవణాలను సముద్రంలోకి చేరుస్తుంది. సముద్రాలలోకి చేరే నీరు తిరిగి ఆవిరి రూపం పొందినా, లవణాలు మాత్రం భాష్పీభవనం చెందలేక సముద్రాల్లోనే పేరుకుపోతుంది. ఈ చక్రక్రమం అనేక కోట్ల సంవత్సరాల నుంచి జరగడం వల్ల సముద్ర జలాల్లో ఉప్పు పరిమాణం నిరంతరంగా పెరుగుతూనే ఉంఉంది. అందువల్లనే ఆ నీరు ఉప్పన.