✳మామూలు ఉష్ణోగ్రతల వద్ద గాలిలోని అణువులు సెకనుకు 500 మీటర్ల వేగంతో కదులుతూ ఒకదానితో ఒకటి తరచూ ఢీకొంటూ ఉంటాయి. వాతావరణంలోని ఉష్ణోగ్రతల మార్పుల వల్ల ఉష్ణం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బదిలీ కావడం వల్ల కూడా గాలిలోని అణువులు కలిసిపోతాయి. ఈ విధంగా వాతావరణంలోని వివిధ వాయువుల అణువులు, వాటి సాంద్రతల్లో తేడా ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలిసిపోవడం ప్రకృతిలో ఒక సహజమైన ప్రక్రియ. ఈచర్య అనంతంగా కొనసాగడానికి కారణం భూమి తన చుట్టూ తాను తిరగడం. భూమి ఉపరితలం పైన 80 నుంచి 120 కిలోమీటర్ల వరకూ వాతావరణంలోని వివిధ వాయువులు వాటి సాంద్రతలతో సంబంధం లేకుండా వాతావరణంలోని 21 శాతం ఆక్సిజన్, 78 శాతం నైట్రోజన్ విడిపోకుండా సమానమైన గాఢత ఉన్న మిశ్రమ రూపంలో కలిసిమెలిసి ఉంటాయి.