అనగనగా ఒక రహదారిలో నడుస్తున్న ఒక రైతుకు చలిలో వణుకుతూ, బిగుసుకు పోయిన ఒక పాము కనిపించింది. ఆ వణుకుతున్న పామును చూసి ఆ రైతు కు చాలా జాలి వేసింది. వెంటనే ఆ పాముకు పాలు పోశాడు. పాలు గడగడా తాగినా ఆ పాముకు చలి, వణుకు తగ్గలేదు. జాలితో ఆ బైతు పామును తన ఛాతీ దెగ్గిరకు తీసుకుని, నెమ్మదిగా నిమిరాడు. కొద్దిసేపటికి ఆ పాముకు వణుకు తగ్గింది. వేంటనే పాము తన అసలు స్వభావము చూపించింది. ఆ రైతును కాటువేసింది. పాపం ఆ రైతు పాముకాటుకి మరణించాడు.
దుష్టులకు ఎంత జాలి, కరుణ చూపించినా, వారికి కృతజ్ఞత వుండదు. అందుకనే పెద్ద వాళ్ళు జాగ్రత్తగా వుండి, మంచి వారితోనే స్నేహము చేయమని చెబుతారు.