జ : ✳ఇళ్ళ లో పలురకాల నూనెలు వాడుతుంటాం ... వీటిలో ముఖ్యమైనది తలమీద రాసుకునే కొబ్బరి నూనె , వంటలకు ఉపయోగించే శనగనూనె . వీటిలో కొబ్బరి నూనె చలికాలములో గడ్డకడుతుంది. కారణము అయా నూనెలలో ఉండే కొవ్వు ఆమ్లాలు. కొబ్బరి నూనె లో సంతృప్త కొవ్వు ఆమ్లాలు 90 శాతము వరకు ఉన్నందున ఉష్ణోగ్రత తగ్గగానే గడ్డకడుతుంది. శనగ నూనె లో అసంతృప్త కొవ్వులు అధికము కాబట్టి గడ్డకట్టవు . అసంతృప్త కొవ్వులకు తక్కువ ఘనీభవన ఉష్ణోగ్రత ఉండగా సంతృప్త కొవ్వులకు ఎక్కువ ఘనీభవన ఉష్ణోగ్రత ఉండును . నూనెలలో ఈ తేడా కనిపిస్తుంది.