✳కరెంటు స్తంభాల మధ్య ఉన్న తీగ ఒకే తీగ కాదు. నిజానికి ఇది కొన్ని తీగల కలయిక. బావిలో నీళ్లు తోడుకునే చేంతాడులాగా, మొలతాడులాగా ఇది కొన్ని తీగలను కలిపితే ఏర్పడినదన్నమాట. ఇక కరెంటు తీగలో సాధారణంగా మధ్యలో వెన్నుపూసలాగా ఒక దృఢమైన ఇనుప స్టీలు తీగ ఉంటుంది. ఈ తీగకు అదనపు బలాన్ని గట్టిదనాన్ని ఇచ్చేందుకు ఆ స్టీలు తీగ చుట్టూ అయిదారు అల్యూమినియం తీగల్ని కూడా జోడిస్తారు. ఈ తీగలన్నీ చాలా దూరం పాటు కుదురుగా వెళ్లాలి కాబట్టి అన్నింటినీ కలిపి ఉంచడానికి వాటిని పెనవేస్తారు. ఇవి మధ్యలో ఉండే స్టీలు తీగను హత్తుకుని మెలివేసుకోవడం వల్ల మరింత కుదురుగా ఉంటాయి.