● ఒంటిచేతితో నమస్కరించరాదు. దేవతలను నమస్కరించేటప్పుడు రెండు చేతులూ దోయిలించి (అంజలించి) రెండు చేతులు విప్పి నమస్కరించాలి. ముకుళ (కలిపి, మొగ్గవలె) ముద్రతో కూడా నమస్కరించవచ్చు. తలవంచి, చేతులు దోయిలించి నమస్కరించడం సరియైన పద్ధతి.
● పాదాభివందనం చేసేటప్పుడు - తమ ఎడమచేతిని అవతలివారి ఎడమపాదంపై ఉంచి, ఆ చేతిమీదుగా తన కుడి చేతిని అవతలవారి కుడి పాదంపై ఉంచి మూడుసార్లు కళ్ళ కద్దుకోవాలి.
● పురుషులు మాత్రమే నేలపై ఆని నమస్కరించాలి. దానిని సాష్టాంగ నమస్కారం అంటారు.
● స్త్రీలు వక్షస్థలం నేలపై ఆన్చరాదు. కనుక వారికి పై విధంగా సాష్టాంగ నమస్కారం లేదు.
● దేవతా మందిరాల్లో, పీఠాధిపతుల సన్నిధానంలో ఇతరులకు నమస్కరించరాదు.
● వందనం చేసేటప్పుడు పాదాలను తాకరాదు. అలా చేస్తే వందనం చేయించుకున్న వారికి శక్తులు పోతాయి.
● పెద్దలకు నమస్కరించేటప్పుడు వారు (పెద్దలు) స్నానం చేసిన తరువాతనే నమస్కరించాలి. స్నానం చేయకుండా ఆశీర్వదించకూడదని నియమం.
_---ఋషిపీఠం సంచిక నుంచి