చమత్కార పద్యం
🌸🌸🌸🌸🌸🌸🌸
కూరగాయ కృతం త్రాసం, పాలనేతి గవాం ప్రియం అంబలి ద్వేషిణం వందే, చింతకాయ శివ ప్రదం తా:--తెలుగు పదాలతో కూడి వున్న ఒక చమత్కార శ్లోకం యిది.
పాలు,నేయి, అంబలి, చింతకాయ అనే పదాలు తెలుగు పదాలు.
అయితే ఆ పదాలను సరిగా విడదీస్తే సంస్కృత
పదాలుగా మారిపోతాయి.
మరి ఒకసారి పరిశీలిద్దామా?
ఇది విష్ణుమూర్తి యొక్క ప్రార్థన.
కూరగాయ కృతం త్రాసం; కు= చెడ్డ, ఉరగము =పాము
కుత్సితమైన ఆలోచనలుగల కాళీయుడనే నాగరాజును కృష్ణావతారంలో మర్దనం గావించి భయాన్ని . కలిగించినవాడికి
వందే=నమస్కరించుచున్నాను. అని అర్థం.
'పాలనేతి గవాం ప్రియం' ఇక్కడ పాలు,నేయి అనే అర్థం కాదు.
పాలనే అతి అని విడదీసుకోవాలి
గవాం పాలనే అతి ప్రియం =ఆవులను కాపాడడం అంటే చాలా ఇష్టపడే వాడు.
కృష్ణావతారం లో గోసంరక్షణ గావించాడు.
అతనికి నేను నమస్కరించు చున్నాను.
అంబలి ద్వేషిణం అన్నప్పుడు
అం =విష్ణువు, బలి ద్వేషిణం అని విడదీసుకోవాలి
బలిని ద్వేషించినవాడికి నమస్కరించు చున్నాను.అని అర్థం.
చింతకాయ శివప్రదం అన్న వాక్యంలో...
చింతన అంటే ఆలోచనచేసే ,ధ్యానించే . చింతకుడు.
విష్ణువును గూర్చి ఆలోచించే వాడికి శుభాన్ని కలిగించేవాడికి నమస్కరించు చున్నాను.