Click here To Download Audio File🦚మానస సంచరరే
బ్రహ్మణి
మానస సంచరరే....
🦚1. మదశిఖి పింఛాలంకృత చికురే
మహనీయ కపోల విజిత ముకురే!!
🦚2. శ్రీ రమణీ కుచ దుర్గ విహారే
సేవక జన మందిర మందారే!!
🦚3. పరమహంస ముఖ చంద్ర చకోరే
పరిపూరిత మురళీ రవ ధారే....
🦚మానస సంచరరే బ్రహ్మణి
మానస సంచరరే....
((((((((0))))))))
భావము:
🦚🦚🦚🦚
ఓ మనసా! బ్రహ్మములో చరిచుము.
🦚1. ఎవని కేశములు నెమలి పించముతో అలంకరించబడి ఉన్నవో, ఎవని అందమైన చేక్కిళ్ళు దర్పణ సౌందర్యమును మించి యున్నవో అట్టి బ్రహ్మములో రమించుము.
🦚2. లక్ష్మీదేవి యొక్క కుచదుర్గముల యందు విహరించువాడును, సేవకులైన భక్తులకు కల్పవృక్షము వంటివాడును అగు బ్రహ్మములో చరించుము.
🦚3. చంద్ర కిరణములతో తృప్తిచెందు చకోరమువలె పరమహంసల మొగముల
యందు వెలుగు దివ్యప్రకాశములో రమించువాడును, వేణువు ద్వారా సదా మధురనాదమును పలికించువాడును అగు బ్రహ్మములో రమించుము.