రామచంద్రపురంలోని కాంతయ్య బ్రతికి చెడ్డవాడు ....
ఒకప్పుడు బాగానే డబ్బులు ఉన్నప్పటికిని ... ప్రస్తుతం బికారి స్థితిలో ఉన్నాడు .
ఐదుగురు పిల్లలు వాళ్ల అవసరాలు చదువులు... వచ్చీపోయే అతిథులు... అనారోగ్యాలు వీటన్నిటితో విసిగిపోయి అడవిలో తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు .
అతని తపస్సుకు మెచ్చి దేవత ప్రత్యక్షమై ..'నీకేం కావాలో కోరుకో కానీ ఒక్కసారి మాత్రమే కోరుకోవాలి 'అని చెప్పింది
కాంతయ్య బాగా ఆలోచించాడు ..తన ఇంట్లో పరిస్థితులు... బీదరికం ..అవసరాలు వీటన్నిటికీ ఎంత డబ్బు అవసరమవుతుందబ్బా .
ఎంత  సొమ్ము అయితే సరిపోతుంది.. ..🤔🤔🤔
అని ఆలోచించాడు..ఎంత అడిగినా తక్కువే అవుతుంది కదా ...
ఈ దేవత ఎంత వరకు ఇవ్వగలదు...
అని ఆలోచించి 'నీ దగ్గర మొత్తం ఎంత ధనం  ఉంది?? 'అని అడిగాడు..
దేవి నవ్వి అనంత ధన రాశిి ఉన్నది అని చెప్పి అదృశ్యమైనది. 
దేనికైనా దేనికైనా ప్రాప్తం ఉండాలి.
************
అన్నమాచార్యుల వారు అన్నట్లు....
ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమె నీవు .....
************