రాగం: వరాళి
స్వరకర్త: యస్.శ్రీనివాసరావు
పాడినవారు: గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్
పల్లవి
పదియారు వన్నెల బంగారు కాంతుల తోడ
పొదలిన కలశాపుర హనుమంతుడు॥
చరణం 1
ఎడమ చేత బట్టె నిదివో పండ్లగొల
కుడిచేత రాకాసి గుంపుల గొట్టె
తొడిబడ నూరుపులతో తూరుపు మొగమైనాడు
పొడవైన కలశాపుర హనుమంతుడు!!
చరణం 2
తొక్కె అక్షకుమారుని తుంచి యడకాళ్ళ సంది
నిక్కించెను తోక ఎత్తి నింగి మోవను
చుక్కలు మోవ పెరిగి సుతువద్ద వేదాలు
పుక్కిటబెట్టె కలశాపుర హనుమంతుడు!!
చరణం 3
గట్టి దివ్యాంబరముతో కవచకుండలాలతో
పట్టపు శ్రీవేంకటేశు బంటు తానాయ
అట్టె వాయువునకు అంజని దేవికిని
పుట్టినాడు కలశాపుర హనుమంతుడు!!
పదియారు వన్నెల బంగారు కాంతులతోడ ...