ఓ అజ్ఞాతకవి యొక్క చమత్కార పద్యం
🍁🍁🍁🍁
కొండమీద నెమలి కోరిన పాలిచ్చు
పశువు శిశువు తోడ భాషలాడు
నారి వేదమును చదవగనే విప్రుడు కాకి మాంసము తిన కంటి కృష్ణ
కలిపి చదివితే కొండమీది నెమలి పాలివ్వడం పశువు శిశువు తో మాట్లాడడం వనిత వేదాన్ని చదవడం విప్రుడు కాకి మాంసము తినడం అని విడ్డూరంగా కనిపిస్తాయి.🤔🤔
మధ్యలో కామా పెట్టి చదివితే
కొండమీద నెమలిని, , కోరితే పాలిచ్చే ఆవును , శిశువుతో మాట్లాడు వనితను , వేదము చదివే విప్రుడిని, మాంసము తినెడి కాకినీ చూశాను...
అని అర్థమవుతుంది.