ఊతక్కాడు వేంకట సుబ్రహ్మణ్య అయ్యర్
గారి కీర్తన:
"స్వాగతం కృష్ణా! "
రాగం: మోహన
తాళం: ఆది
పల్లవి:
స్వాగతం కృష్ణా!
శరణాగతం కృష్ణా!!
మధురాపురి సదనా! మృదువదనా!
మధుసూదనా!
ఇహ స్వాగతం కృష్ణా...
అనుపల్లవి;
భోగదాప్త సులభా!
సుగంధ పుష్ప కలభ!!
కస్తూరి తిలక మహిబా!
మమకాంత నందగోపకంద!!
చరణం:
ముష్టికాసూర చాణూర మల్ల
మల్ల విశారద మధుసూదనా
ముష్టికాసూర చాణూర మల్ల
మల్లవిశారద కువలయ పీఠ
మర్దన! కాళింగమర్ధన!!
గోకుల రక్షణ సకలసులక్షణ దేవా!
శిష్ట జనపాల ! సంకల్ప కల్ప
కల్పశత కోటి అసమ పరాభవ
వీర మునిజన విహార!
మదన సుకుమార !
దైత్యసంహార దేవా!
మధుర మధుర రతిసాహస సాహస
వ్రజయువతీ జన మానస పూజ