🙏 రామాయణంలో ముఖ్యమైన విషయం🙏
------------------------------------
👉ఓక మహారాజు గారి ఆస్థానంలో ఒక రోజు పండిత మహాసభ జరుగుతున్నది. పండితులు, పామరులు మరియు జ్ఞానులు అందరూ పాల్గొన్నారు.ఈ సభలో రాజుగారు మాట్లాడుతూ.. "రామాయణం లో అత్యంత తృప్తిని ఇచ్చేటి ఒక శ్లోకం చెప్పండి "అన్నాడు. అందరూ బాగా ఆలోచించి అనేక విషయాలు తెల్పారు.కానీ రాజుగారికి తృప్తి కలగలేదు.తరువాత రాజుగారు మంత్రిగారిని "మంత్రివర్యా మన రాజ్యంలో ఉన్న పండితులలో ఒక్కరుకూడా తృప్తి కలిగించే శ్లోకం చెప్పలేక పోయారు.కావున నీవు అనేక ప్రాతాంలను తిరిగి నాకు నచ్చిన శ్లోకాన్ని చెప్పాలి.లేదా నీకు శిక్ష తప్పదు అన్నాడు.పాపం చేసేది లేక మంత్రి రాజ్యాలన్నీ తిరిగాడు.కానీ ఎక్కడ తిరిగినా ఎవరితో మాట్లాడినా మంత్రిగారికే తృప్తి కలగడం లేదు.తరువాత మంత్రి నైరాశ్యంతో ఒక చెట్టు క్రింద కూర్చని బాగా ధ్యాన స్థితిలోకి వెళ్ళాడు. ఆ స్థితిలో అతని అంతరాత్మ నుండి ఒక మంచి శ్లోకం వినబడింది.అదేమిటంటే....
రామం దశరథాం విద్దీ...మాం విద్దీ జనకాత్మజః
అయోద్యం అటవీం విద్దీ...గచ్చం తాత యదా సుఖం
ఈ విషయాన్ని సుమిత్రాదేవి తన కుమారుడైన లక్ష్మణస్వాముల వారికి తెల్పిన విషయం
లక్ష్మణా.....అరణ్యవాసంలో నీవు ఏం చేయాలంటే ......
"రామం దశరథాం విద్దీ "...నీతండ్రి గారిని ఎంత గొప్పగా పరిచర్యలు చేస్తూ చూసుకొన్నావో ఆవిధంగానే మీ అన్నగారైన శ్రీరామచంద్రమూర్తిని కంటికిరెప్పలా చూసుకోవాలని తెల్పింది.అదేవిధంగా "మాం విద్ది జనకాత్మజః " జనకుని ఆత్మ అయిన మీవదిన సీతా మాతను, నీతల్లి అయిన నన్ను ఎలా చూసుకున్నావో అలా చూసుకోవాలి. అనితెల్పినది. "అయోద్యా అటవీం విద్దీ " అయోద్యారాజ్యాన్ని ఎంత పవిత్రంగా చూసుకున్నావో అంత పవిత్రంగా ప్రకృతి మాతయైన అడవి తల్లిని చూసుకొని వనవాసాన్ని సుఖంగా గడిపి రండి....అని సుమిత్రాదేవి దీవించింది.
ఇక్కడ మనం గమనిస్తే
🔹అన్న ....కన్నతండ్రితో సమానము.
🔹వదిన కన్నతల్లితో సమానము.
🔹మన సొంత ఇంటిని ఎలా చూసుకుంటామో ప్రకృతి మాతను చూసుకోవాలి.
ఇలా చూసుకున్నప్పుడు ఇక సమస్యలు అసలే ఉండవు.
సుమిత్రామాత యొక్క కుటుంబవాత్సల్యం ..
.రాముడిపై గల ప్రేమ ....అనురాగం, ఆప్యాయత వలన తన కన్నకొడుకుని కూడా అడవులకు పంపిన ఇల్లాలు....సుమిత్ర...
అదేవిధంగా తనకు అవసరం లేకపోయినా అన్న,వదినల కోసం అడవికి వెళ్ళిన లక్ష్మణుడు ....
వీరి గురించి తెలుసుకుంటే మన జన్మధన్యమౌతుంది.
మన కుటుంబాలు కూడా ఇలా
ఆప్యాయతానురాగాలతో జీవించాలి....ఇదియే కుటుంబ ధర్మం....