పూర్వం విష్ణు శర్మ అనే ఒక రాజుండే వాడు.అతడికి విపరీతమైన కథల పిచ్చి.
తన ఆస్థానం లో వున్న వారి నందరినీ కథలు చెప్పమని సతాయించేవాడు.....
ఇక ఆస్థానం లో సభ్యలందరికి విసుగు వచ్చేసింది.. ..
మంత్రి గారు రాజుతో సంప్రదించి రాజుకు కథలు చెప్పడానికి ఎవరైనా రావచ్చుననీ తగిన బహుమానం యివ్వ బడుతుందనీ చాటింపు వేయించారు.. .
.
ఎంతమందో వచ్చి ఆయనకు ఎన్నో కథలు వినిపించేవారు.ఎన్ని చెప్పినా ఆయన యింకా చెప్పమని అడిగే వాడు.రాజు గారికి విసుగే వుండేది కాదు.
ఎంత మంది వచ్చినా రాజును తృప్తి పరచ లేక పోయారు.నాకు కథలు చెప్పి తృప్తి పరిస్తే సగం రాజ్యమిస్తాను లేకుంటే మరణ శిక్ష అని ప్రకటించాడు..
కొంత మంది యువకులు సగం రాజ్యం ఆశతోవచ్చారు ఆయనను సంతృప్తి పరచలేక మరణించారు.ఆఖరుకు మరణ భయం తో ఎవరూ రావడం లేదు.రాజు మంత్రిని పదే పదే ఈ విషయం గురించి సతాయించే వాడు.
ఒకనాడు ఒక బీద బ్రాహ్మణుడు నేను మీకు కథ చెప్తానని వచ్చాడు.సరే నని రాజు కూర్చున్నాడు.
.
ఆ బ్రాహ్మణుడు కథ చెప్పడం మొదులు పెట్టాడు....
ఒక వూరిలో ఒక రైతు ఉండేవాడు అతను తనపొలం లో జొన్నలు పండించాడు.
ఆ సారి వర్షాలు బాగా పడి విపరీత మైన పంట పండింది.ఆ రైతు ఒక పెద్ద గోదాము కట్టించి జొన్నబస్తాలను అందులో వుంచాడు.దాన్ని అన్ని పక్కలనుంచీ మూసివేసినా ఒక మూల చిన్న కంత వుండి పోయింది.
అది ఒక పిట్ట చూసింది.ఆ కంత లోనుంచి లోపలి పోయి తనముక్కున ఒక గింజ కరుచుకొని పోయింది మళ్ళీ వచ్చి ఒక గింజ ముక్కున కరుచుకొని పోయింది యిది చూసి మిగతా పిట్టలు కూడా వచ్చి ఒక్కో గింజా ముక్కున కరుచుకొని పోతూ వున్నాయి.ఒక పిట్టా ఒక గింజ,ఒకపిట్టా
ఒకగింజ అంటూ అదే మాట చెప్తూ వచ్చాడు...
ఎన్ని రోజులు గడుస్తున్నా అదే చెప్తూ వున్నాడు.రాజుకు విసుగు పుట్టింది తరువాతి కథ చెప్పకుండా యిదేమిటి?అని విసుక్కున్నాడు.
అందుకు అతను మహారాజా!మరి అన్ని బస్తాల ధాన్యం అయిపోవాలికదా! ఆ తరువాతే మిగతా కథ అని మళ్ళిీ ఒక పిట్టా ఒక గింజ అని మొదులు పెట్టాడు..రాజుగారికి ఇక తల నొప్పి వచ్చేసింది.. చాలించు మహా ప్రభూ నీ కధలు. అన్నాడు.
అందుకు ఆ బ్రాహ్మణుడు
ఎలా చాలించేది ప్రభూ!చాలిస్తే నా చావు తప్పదు కదా! అని మళ్ళి మొదలు పెట్టాడు.
రాజుకు విసుగు పుట్టి
యిక మీదట కథలు చెప్పమని అడగను.. నీకు అర్ధ రాజ్యం యిస్తాను దయచేసి యింక చాలించు అన్నాడు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా అన్నారు బాగుంది.యింకేప్పుడూ కథలు చెప్పమని ఎవరినీ యిబ్బంది పెట్టకండి.అని అర్ధ రాజ్యం నాకేమీ వద్దు కొంత ధనం యిప్పించండి చాలు అన్నాడు.
అప్పుడు రాజు అతనికి
జీవితానికి సరి పడా ధనం యిచ్చి పంపించాడు.
అందరూ ఈ కథల పీడ వదిలించి నందుకు ఆ బ్రాహ్మడిని అభినందించి ఊపిరి పీల్చు కున్నారు..
అప్పటి నుండీ ఆ రాజు బుద్ధి తెచ్చుకొని ప్రజానురంజకంగా పరిపాలించాడు...
🌷🌷🌷🌷🌷🌷🌷
అధికారం చేతిలో వుంది కదా.... అని ఎవరు కూడా ప్రజలను తన క్రింది అధికారులనూ సతాయించ కూడదు.
🌷🌷🌷🌷🌷🌷🌷
యః పఠతి లిఖతి పశ్యతి పరి పృచ్ఛతి పణ్డితాన్ ఉపాశ్రయతి ।
తస్య దివాకరకిరణైః నలినీ దలమివ విస్తారితా బుద్ధిః
*నిరంతర పఠనము వలన,*వ్రాయుట వలన, *
నిరంతర పరిశీలన *వలన పండితులనాశ్రయించి
వారితో చేసే విజ్ఞాన విషయ* చర్చల ద్వారా, సంశయనివృత్తి ద్వారా వ్యక్తి యొక్క బుద్ధి వికసిస్తుంది, విస్తరిస్తుంది. ఎవరైతే నిరంతరమూ పఠిస్తూ ఉంటారో, పరిశీలిస్తూ ఉంటారో, పండితులనాశ్రయించి సంశయ నివృత్తి చేసుకుంటూ ఉంటారో అటువంటి వారియొక్క బుద్ధి, సూర్యకిరణాలను తాకిన కమల దళం ఏ విధంగా విచ్చుకుంటుందో, అదేవిధంగా విస్తరిస్తూ పోతుంది. సూర్యరశ్మి తాకిన తామర పువ్వు రేకలు ఏ విధంగా వికసిస్తాయో ఆ విధముగా బుద్ధి కూడా వికసిస్తుంది.
వ్యక్తి యొక్క మనో వికాశమూ, బుద్ధి వికాసాలకి నిరంతరము మంచి అలవాట్లు పాటించడమూ, పండితులయొక్క నిరంతర సాంగత్యముల ఆవశ్యకతని తెలియచెప్పుతున్నది
ఈ సుభాషితం.