యౌం –ఎ-అషురా విశేషాలు
ముహమ్మద్ అజ్గర్ అలీ.
ముహర్రం నెల ముస్లింలకు ఒక చారిత్రక నెల. యౌం –ఎ-అషురా లేదా అషురా ముహర్రం 10 వ రోజు. దీని అర్థం 'ప్రకాశించే రోజు'. ఈ పదం 'ఆశా నురా ' నుండి ఉద్భవించింధి.ఇది ఇస్లామిక్ క్యాలెండర్ లో ఒక ముఖ్యమైన తేదీ. కర్బాలా యుద్ధంలో ఇమామ్ హుస్సేన్ బలిదానం తో సహా అనేక సంఘటనలు ఈ ప్రత్యేక రోజున సంభవించినవి.
10 వ ముహర్రం న జరిగిన సంఘటనలు:
తన ప్రసిద్ధ పుస్తకం గున్యా లి –తలిబి అల్ హక్ (Ghunya li-Talibi Tariq al-Haqq), లో హజ్రత్ అబ్దుల్ ఖాదీర్ జిలాని ( రహ్మా) లో వ్రాస్తూ యౌం –ఎ-అషురా రోజున జరిగిన క్రింది సంఘటనలు పేర్కొన్నారు.
అల్లాహ్ స్వర్గం నుండి బహిష్కరణ తరువాత ప్రవక్త ఆదం(AS)యొక్క పశ్చాత్తాపం అంగీకరించారు;
అల్లాహ్ ప్రవక్త నుహ్(AS) అతని సహచరులను ఆర్క్ నుండి రక్షించారు.
అల్లాహ్ ప్రవక్త ఇబ్రహీం (AS) నిమ్రోద్ (ఫారో) ద్వారా విసిరిన అగ్నిని అర్పినారు.
అల్లాహ్ ప్రవక్త మూసా తో (AS) నేరుగా మాట్లాడారు అతనికి ఆదేశాలు (కమాండ్మెంట్స్) ఇచ్చారు.
ముహర్రం 10 తేదిన, ప్రవక్త అయూబ్(AS) కుష్ఠు వ్యాధినుండి ఆరోగ్యo పునరుద్ధరించబడింది.
ప్రవక్త యూసుఫ్(AS) తన తండ్రి ప్రవక్త యాకుబ్(AS) తో కలిసారు.
ప్రవక్త యూనస్(AS) చేప కడుపు నుంచి విడుదలైనారు.
ఇజ్రాయెల్ దేశం నిర్బంధంలో నుండి విడుదలై సముద్రo విభజించబడింది, మరియు ఫారో (Pharoah) యొక్క సైన్యం నాశనమైంది.
అషురా రోజు ప్రవక్త దావూద్(AS) క్షమింపబడిన రోజు.
ప్రవక్త సులైమాన్ రాజ్యం(AS) పునరుద్ధరించబడింది.
ప్రవక్త ఈసా(A.S) జన్నాత్ కు తీసుకు వేల్లబడినారు.
మరియు ప్రవక్త (స) మనమడు ఇమామ్ హుస్సేన్ RA, కర్బాలా వద్ద బలిదానం పొంది గౌరవం సాధించాడు.
యౌం -ఇ-అషురా రోజున నఫిల్ ప్రార్ధనలు:
నఫిల్ నమాజ్ (Nafl Namaaz):
ప్రవక్త(స) ప్రకారం అషురా రోజున నాలుగు రకాత్ నమాజ్ పఠించాలి. సురా ఫాతిహా ప్రతి రకాత్ తరువాత సురా ఇక్లాస్ 11 సార్లు చదవడం ద్వారా ఆ వ్యక్తి చేసిన పాపాలను అల్లాహ్ యాభై సంవత్సరాల పాటు క్షమిస్తాడు, మరియు అతనికి అల్లాహ్ యొక్క నూర్ (కాంతి) ఆశీర్వాదం ఉంటుంది అని అన్నారు. " నుజ్జాత్ అల్ మజ్లిస్ వా మున్తఖాబ్ అల్ నఫా’స-1 వ్యాలుం , Pg. 181
ఉపవాసం:
అబి కుతదహ్ (ర) అనుసారం ప్రవక్త (స) "అషురా రోజు అల్లాహ్ గత పాపాలన్నీ ప్రక్షాళనం చేస్తారని " అన్నారు -మిష్కతే షరీఫ్, Pg. 179.
"రంజాన్ తర్వాత ఉత్తమ ఉపవాసం అల్లాహ్ నెల –ముహర్రం మరియు ప్రార్థన తర్వాత ఉత్తమ ప్రార్థన విధ్యుక్తమైన(ఫర్జ్) రాత్రి ప్రార్థన." - సహీహ్ ముస్లిం హదీసులు # 1163
హిజరి 10 వ సంవత్సరంలో, రసూల్ అల్లాహ్ తన ఉత్తమ సహచరులతో అషురా యొక్క ఉపవాసం ఉంచినారు. వారి సహచరులు అడగగా "నిశ్చయంగా, యూదులు మరియు క్రైస్తవులు గౌరవించే రోజు” కూడా ఇది అని పేర్కొన్నారు. "నేను సజీవం గా ఉంటె అప్పుడు నేను ముహర్రం 9 న [అలాగే 10 వ] రోజున కూడా ఉపవాసం ఉంటాను అని ప్రవక్త బదులిచ్చారు కాని ఆ లోపలే ప్రవక్త(స) పరమపదించారు. – మిష్కతే షరీఫ్, Pg. 179.
ఈ కారణం చేతనే ముస్లింల ఆరాధనా ముస్లిమేతర నుండి ప్రత్యేకoగా ఉంచబడుతుంది మనము ఉపవాసం ఆరాధన ముహర్రం 9 రోజు తో పాటు 10 వ రోజు న కూడా ఉంచవలయును.
ఇతర ఉత్తమ పనులు:
అషురా రాత్రి మేల్కొన వ్యక్తి దైవ దూతల సువాబ్ పొందుతాడు. రుహుల్ బయాన్ –తఫ్సీర్.
హజ్రాత్ అబ్దుల్ ఖాదీర్ జిలాని (రహ) గారు అషురా రోజు క్రింది వివిధ పనులు చేయవలెనని ఘున్యా లి –తలిబి అల్ హక్ (Ghunya li-Talibi Tariq al-Haqq), లో ప్రస్తావిoచినారు:
ఎవరైతే ఈ రోజు ఉపవాసం ఉంటారో అతను జీవితాoతం ఉపవాసం ఉన్నాట్లే.
నగ్న వ్యక్తికి బట్టలు దానం చేసిన వ్యక్తి కి అల్లాహ్ బాధాకరమైన శిక్ష నుండి విడుదల చేస్తాడు.
ఒక జబ్బుపడిన వ్యక్తి సందర్శించే వారికి అల్లాహ్ నుండి ఎప్పటికి తరగని బహుమతి లభిస్తుంది.
ఒక అనాధ యొక్క తల మీద ఎవరైతే తన చేతిని ఉంచుతారో, లేదా ఒక ఆకలితో ఉన్న వ్యక్తి కి అన్నం పెడతారో లేదా ఒక మనిషికి నీరు త్రాగటానికి ఇస్తారో అతనికి అల్లాహ్ స్వర్గం నుండి విందు ఆహారం మరియు అతని దాహం తిరటానికి సల్సబిల్ (మత్తు లేని వైన్) ఇస్తాడు.
ఈ రోజున స్నానం చేసిన వ్యక్తికి జీవితాంతం అనారోగ్యం దరి చేరదు మరియు మంచి ఆరోగ్యo మరియు స్వేచ్ఛ తో ఆనందిస్తారని అన్నాడు.
ఈ రోజు తన కుటుంబం కోసం దాతృత్వముగా అందిoచిన వ్యక్తి పట్ల అల్లాహ్ ఈ ఏడాది పొడవునా అతని పట్ల ఉదారంగా ఉంటాడు.
మరియు ఎవరైతే తన కళ్ళుకు ఖుల్ (KUHL) పుస్తాడో అతను ఎప్పుడు కంటి రోగాలతో బాధపడడు.
అషురా రోజున విచారాన్ని వ్యక్తం చేయుట
క్రమం తప్పకుండా ఎదురయ్యే ప్రశ్న? హుస్సేన్(ర) మరణం మీద కేకలు వేయటం జహాలియా (jahiliyyah) చర్య కాదా? దానికి సమాధానం మీరు కేకలు వేయడానికి ఒక షియా అవవలసిన అవసరం లేదు" అని వస్తుంది.
ఇస్లాం ప్రకారం కర్బాలా యొక్క సంఘటనలు మరియు మన ప్రియమైన ఇమామ్ హుస్సేన్ (ర) చేసిన త్యాగం జ్ఞాపకమునకు , ఒక నిశ్శబ్ద లేదా నియంత్రిత పద్ధతిలో అషురా దినమున విచారం వ్యక్తం చేయుటకు అనుమతించబడుతుంది.
ఇస్లాం ఏడ్చుట మరియు బిగ్గరగా కేకలు వేస్తూ , రక్తo వారి శరీరాలు నుండి ప్రవహిస్తు కలతపెట్టే పద్ధతిలో మాతం ('Matam') శోకం వ్యక్తం కు అనుమతివ్వలేదు. ఈ మాతం ("matam") పద్ధతులకు ప్రారంభ ఇస్లాం లో చారిత్రక ప్రాధాన్యత లేదు. సహాబాలు ఎప్పుడు రక్తస్రావం, తమ వీపులపై తాము కొట్టుకోవడం చేయలేదు.
ఇమామ్ మాలిక్ (ర)ఇలా చెప్పాడు “అప్పుడు మతం లో భాగం కానిది నేటి మతం లో భాగం కాదు"
ప్రవక్త ముహమ్మద్ (స) యొక్క "కుమారుడు" ఇబ్రహీం మరణించినప్పుడు సహాభాలు లేదా ప్రవక్త(స) మాతం (శోకం) చేయ లేదు.
ప్రవక్త (స)సమయంలో సూర్యగ్రహణo జరిగింది. ప్రజలు ఈ సంఘటనను ప్రవక్త(స) యొక్క కుమారుడు ఇబ్రహీంయొక్క మరణం తో ముడి పెట్టగా ప్రవక్త (స) వారికి ఈ విషయం గురించి నిజం వివరించారు.
“ప్రవక్త (స) అల్లాహ్ ను ప్రశంసించారు మరియు కీర్తించారు మరియు సూర్యుడు మరియు చంద్రుడు అల్లాహ్ రెండు చిహ్నాలు అన్నారు. వారు ఎవరి మరణం లేదా జన్మదినాన మరుగునపడింది లేదు. మీరు వాటిని చూసినప్పుడు అల్లాహ్ ను కీర్తిస్తూ ప్రార్థన చేయండి మరియు దానం ఇవ్వoడి. ఓ! ముహమ్మద్ యొక్క ఉమ్మా అతని సేవకుడు/సేవకురాలు వివాహేతర సంబంధం చేసుకుంటే అల్లాహ్ కంటే ఎక్కువ ఆగ్రహించిన వారు లేరు. ఓ ముహమ్మద్ ప్రజలారా నాకు ఏమి తెలుసో మీకు తెలుసిఉంటె మీరు చాలా ఏడుస్తూ చిన్న నవ్వు నవ్వు తారు. అల్లాహ్ సాక్షిగా, నేను వారికి సమాచారం ఇచ్చాను."(అల్ బుఖారి)
ఇంకా ప్రవక్త (స) ఇలా అన్నారు " తన చెంపలు వాయించు కొనే వ్యక్తి మా సమూహం కాదు, తన బట్టలు చించుకొని కన్నీళ్లు పెట్టుకొనే వ్యక్తి జహిలియా (Jahiliyyah) /అజ్ఞాన కాల వ్యక్తి అన్నారు." - సహీహ్ బుఖారీ
ప్రవక్త ముహమ్మద్ (స)చే నిషేధించబడింది ప్రజలు చేయడం మనం చూస్తున్నాo అది చాల దురదృష్టకరం. ముహర్రం 9 వ మరియు 10 వ రోజు రెండు రోజుల ఉపవాసం కోసం ఒక సున్నితమైన హెచ్చరిక ఉంది. ముహర్రం 10 వ మరియు 11 వ రోజు కూడా ఉపవాసం చెయ్యవచ్చు.
ముహార్రం (9 వ మరియు 10 వ రోజు లేదా 10 వ మరియు 11 వ రోజు ) రెండు రోజులు ప్రవక్త (స) ద్వారా ఆజ్ఞాపించినట్లు ఉపవాసం ఉండి అల్లాహ్ నుండి సమృద్ధిగా సువాబ్ సంపాదించండి. ఇది మీ స్నేహితులు, బంధువులు అందరికి తెలపండి.