ఈ మధ్యకాలం లో మంచం లో నల్లుల బాధ తగ్గిపోయింది కాని ఒకానొకప్పుడు ఆ నల్లులు జనాన్ని చాలా ఇబ్బంది పెట్టేవట...
ఆ సందర్భం లో వ్రాసిన ఈ చాటువు చూడండి...
 శివడద్రిని శయనించుట, 
 రవి చంద్రులు మింటనుంట రాజీవాక్షుండ  విరళముగ శేషుని పై బవళించుట 
 నల్లిబాధ పడలేక సుమీ.
శివుడు హిమాలయ పర్వతం మీద శయనిస్తాడు.
సూర్యుడు , చంద్రుడు ఆకాశంలో ఉంటారు.
 విష్ణుడెప్పుడు పాలసముద్రంలో శేషతల్పం మీద పడుకుంటాడు.
 వీరంతా భూమి మీద ఉండకుండా ఆయా చోట్ల ఉండడం నల్లికి భయపడే - అని చమత్కారం.
మనం పడే నల్లి బాధ ఎంత భయంకరమైనదో తెలియచెప్పడానికి ఇంత గొప్ప దేవతలు కూడా నల్లి బాధ పడలేకనే అటువంటి నివాసాలు ఏర్పరచుకున్నారని ఒక కవి చమత్కారం.