ఆదిశంకరాచార్య విరచితము
దుఖఃనాశనము-శివలోకప్రాప్తి ....
1 ప్రాతఃస్మరామి భవభీతిహరం సురేశం
గంగాధరం వృషభవాహన మంబికేశం
ఖట్వాంగ శూల వరదాభయ హస్తమీశం
సంసార రోగహర మౌషధ మద్వితీయం ॥॥
2 .ప్రాతర్నమామి గిరీశం గిరిజార్ధదేహం
సర్గస్థితిప్రళయ కారణ మాదిదేవం
విశ్వేశ్వరం విజిత విశ్వ మనో భిరామం
సంసార రోగహర మౌషధ మద్వితీయం ॥॥
3. ప్రాతర్భజామి శివమేక మనంతమాద్యం
వేదాంత వేద్య మనఘం పురుషం మహాంతం
నామాది భేదరహితం షడ్భావ శూన్యం
సంసార రోగహర మౌషధ మద్వితీయం ॥॥
ప్రాతఃసముత్థాయ శివం విచింత్య
శ్లోకత్రయం యే సుదినం పఠంతి
తే దుఖః జాతం బహుజన్మ సంచితం
హిత్వాపదం యాంతితదేవశంభోః ॥॥