నేడు భరతమాత ముద్దుబిడ్డ "అబ్దుల్ కలాం" గారి జయంతి.. ఆ మహానుభావుడిని గుర్తుచేసుకుంటూ కొన్ని విషయాలు..🌹
👉ఓ గొప్ప సైంటిస్టు. గొప్ప రాష్ట్రపతి. మంచి రచయిత. అంతకు మించిన మార్గనిర్దేశకుడు. అందరికీ ఆదర్శనీయుడు. అన్నింటికీ మించి ఓ గొప్ప దేశభక్తుడు. అన్నీ కలగిస్తే డాక్టర్ APJ అబ్దుల్ కలాం. మిస్సైల్ మ్యాన్ గా దేశ చరిత్రను ప్రపంచానికి చాటారు కలాం గారు. ఆయన సేవలను స్మరించుకుంటోంది దేశం.
🍁పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు..🍁
👉రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ దాకా.. పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ దాకా సాగింది ఆయన ప్రస్థానం. కెరీర్ లో ఒకేసారి ఇస్రో నుంచి నాసా నుంచి పిలుపొచ్చింది. డాలర్ డ్రీమ్స్ కన్నా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తిత్వం ఆయనది. ఆయనే ఆవుల్ పకీర్ జైనలుబ్దీన్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం.
🍁మిస్సైల్ మ్యాన్🍁
👉జీవితంలో ఎన్నో మైలురాళ్లను దాటారు అబ్దుల్ కలాం. ఓ సైంటిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన కలాం తర్వాత అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కు ఎన్నో విజయాలందించారు. అగ్రరాజ్యాల సరసన భారత్ ను నిలిపిన మహోన్నత వ్యక్తి కలాం. అగ్ని, పృధ్వీ సహా ఎన్నో మిస్సైల్స్ ఆయన డైరెక్షన్ లోనే నింగిలోకి దూసుకెళ్లాయి. బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధికి ఏర్పాటైన ప్రాజెక్ట్ డెవిల్ మరియు ప్రాజెక్ట్ వాలియెంట్(VALIAN)కు కలాం డైరెక్టర్ గా పనిచేశారు. జూలై 1992 నుండి డిసెంబర్ 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శి గా వ్యవహరించారు. సేమ్ టైమ్ పోఖ్రాన్-II అణు పరీక్షల్లో కలాం కీ రోల్ ప్లే చేశారు.
🍁కృత్రిమ కాలు తయారీలో కీలకపాత్ర🍁
👉వైద్య పరిశోధనాల్లోనూ కలాం.. సత్తా చాటారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమరాజుతో పాటు కలాం రీసెర్చ్ చేశారు. తక్కువ ధర కలిగిన కొరోనరీ స్టెంట్ కలాం-రాజు స్టెంట్ ను అభివృద్ధి చేశారు. 2012లో ఇద్దరూ కలిసి, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం కలాం -రాజు టాబ్లెట్ పీసీని రూపొందించారు. అంతేకాదు కృత్రిమ తేలిక కాలు తయారు చేయడంలోనూ కలాం పరిశోధనలు.. దివ్యాంగులకు వరంగా మారాయి. జైపూర్ కాలు మూడున్నర కేజీల బరువు ఉంటుంది. కలాం ప్రయోగంతో 350 గ్రాముల కాలిపర్ కాలును రూపొందించారు కలాం. ఇక మన హైదరాబాద్ తో కలాంది ప్రత్యేక అనుబంధం. నగరంతో ఆయనకు ఎన్నో ఏళ్ల అనుబంధముంది. మొదట DRDOలో సైంటిస్ట్ గా, తర్వాత DRDL డైరెక్టర్ గా ఇక్కడ పనిచేశారాయన.
🍁నిత్యం దేశసేవలోనే..🍁
👉సైంటిస్టుగా రిటైర్డయ్యాక.. దేశ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు కలాం. రాజకీయాలతో సంబంధం లేకుండా అధికార, విపక్షాల మద్దతుతో రాష్ట్రపతిగా ఎన్నికైన అబ్దుల్ కలాం ఆ పదవికే వన్నె తెచ్చారు. రాష్ట్రపతి భవన్ కే విలువలు పెంచారు. అత్యున్నత పదవిలో ఉన్నా ఎక్కడా తన వినయానికి ఎక్కడా లోటు రానివ్వలేదు. ఏపీలోని విశాఖ నుంచి మూడున్నర గంటలు సముద్రయానం చేసి రికార్డు సృష్టించారు. పూణె నుంచి యుద్ద విమానం ఎక్కి ఆకాశంలో విహరించిన ఫస్ట్ ప్రెసిడెంట్ కూడా కలామే కావడం విశేషం. సియాచిన్ గ్లేసియర్ లోనూ పర్యటించి అక్కడి సైన్యంలో స్పూర్తి నింపిన రాష్ట్రపతి కూడా కలామే.
🍁పదవికే వన్నెతెచ్చారు..🍁
👉ఇక రాజ్యాంగ బద్దమైన రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన వ్యక్తుల్లో కలాం ఒకరు. పార్లమెంట్ ఆమోదించిన జోడు పదవుల బిల్లును కేంద్రానికి తిప్పిపంపారాయన. తన పదవీకాలంలో ఎన్నో రాజ్యాంగ సంక్షోభాలు వచ్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అప్పటి బీహార్ గవర్నర్ భూటాసింగ్ విషయంలో సుప్రీం తీర్పును అనుసరించి ఆయనతో రాజీనామా చేయించిన ప్రెసిడెంట్ కూడా కలామే.
🍁విద్యార్థులతోనే జీవితం..🍁
👉కలాం ప్రెసిడెంట్ భవన్ లోకి అడుగుపెట్టినసప్పటినుంచి ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్రపతి భవన్ లో మొత్తం 12 గార్డెన్స్ ఉన్నాయి. ఇందులో ఒక దానిని ప్రత్యేకంగా వికలాంగుల కోసమే కేటాయించారంటే ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులతో కలాంది ప్రత్యేక అనుబంధం తాను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రతీ వారం స్టూడెంట్స్ తో స్పెషల్ గా మీటయ్యేవారు. రాజ్యంగ పదవి నుంచి దిగిపోయాక కూడా నిత్యం విద్యార్థుల మధ్యే గడిపేవారు. 2007లో రాష్ట్రపతి పదవీ విరమణ తర్వాత ఆయన అధ్యాపకుడిగా మారిపోయారు. మనిషి తలుచుకుంటే ఏది అసాధ్యం కాదు. కలలు కనాలి. అవి సాధ్యం అయ్యేవరకు శ్రమించాలి అంటూ స్ఫూర్తి నింపారు.. నింపుతున్నారు.