ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు పాలు, పెరుగు,నెయ్యి,అన్నీ అమ్ముకుంటూ తన
భార్యతో జీవితం
సాగిస్తుండేవాడు. కొన్ని పాలని ఊరిలో అమ్మి
ఇంకా కొన్ని పాలతో నెయ్యి చేసి వారానికి ఒకసారి మార్కెట్ కు వెళ్లి అమ్మేవాడు.
భార్య నెయ్యిని ఒక్కో ప్లాస్టిక్ సంచిలో
kg బ్యాగ్స్ లో వేసి ఇచ్చేది,ఒకరోజు మార్కెట్ కు వెళ్ళి రోజంతా అమ్మి,ఒక కొట్టుకు వెళ్ళి
అక్కడ ఆ యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు పప్పు బియ్యం అన్నీ సరుకులు ఇంటికి
తీసుకొని బయలుదేరాడు అప్పుడు కొట్టు యజమాని నెయ్యిని తీసిపెడుతూ ఒక బ్యాగ్ ను తూకం
వేసి చూశాడు ఆయనకు ఆక్షర్యం వేసింది 1kg లేదు కేవలం 900 గ్రాములే ఉంది.యజమాని
అన్ని తూకం చేసి చూస్తే అన్నీ 900gm బ్యాగులే ఉన్నాయి.ఆయనకు చాలా మనసుకు బాధ అనిపించింది, ఇతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే.నన్ను మోసం చేశాడే అని అనుకున్నాడు.
మళ్ళీ ఒక వారం తరువాత పాలు అమ్మేవాడు నెయ్యి
అమ్మటానికి వచ్చాడు. అప్పుడు యజమాని చెప్పాడు
నా కొట్టుకు ఇకపై కాలు పెట్టకు నీవు మోసగడివి నమ్మకద్రోహివి .నెయ్యి 1kg అని 900gm ఇస్తావా ఇకపై నీతో నేను
వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు అని గొడవ చేశాడు.
అప్పుడు ఆ పెద్దాయన వినయంతో యజమాని తో
ఇలా చెప్పాడు, అయ్యా నేను బీదవాడినే కానీ. మోసగాణ్ణి
కాదు నా దగ్గర తక్కెడ కొనే అంత డబ్బు లేదు మీ దగ్గర తీసుకెళ్లిన 1kg చక్కెర ఆధారంగా ఇంట్లో
తక్కెడ లా చేసుకొని తూకం చేస్తాను అని చెప్పాడు. అందుకు యజమాని తల వంచుకుని తన తప్పు
తనకు తెలిసి సిగ్గు పడ్డాడు.
మనం వేరేవారికి
ఏం చేస్తామో తిరిగి మనకు అదే మళ్ళీ మనకు జరుగుతుంది.
అది మంచి కానీ చెడు కానీ గౌరవం కాని దుఃఖం కానీ తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది...