చైత్రమాస వేళలో...
వసంత శోభతో అలరారేమాసం ”చైత్రం. సంవత్సరంలో వచ్చే మొదటిమాసం. చెట్లు చిగిర్చి, పూలుపూసి, పచ్చదనంతో కంటికి ఆహ్లాదాన్నిస్తుంది ప్రకృతి. అందుకు కృతజ్ఞతను తెలుపుతూ, ప్రకృతిలోని మార్పులకు తగినట్లుగా వ్యవహరించడానికి ఉగాది పండగను జరుపుకునే ఏర్పాటు చేశారు పెద్దలు. ”చైత్ర-వైశాఖల్లో ప్రకృతిలో వచ్చే మార్పుల వలన ”మానసిక-శారీరక బలం చేకూరుతుందని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. మొదటి బుతువ్ఞ, మొదటి మాసం, మొదటి పక్షం, మొదటి వారం ఆయనంలో మొదట వచ్చే తిథి ”పాడ్యమి. ఇన్ని విశేషాలు ఉండడం వల్ల చైత్రమాస శుభారంభాన్ని ”ఉగాదిగా జరుపుకుంటున్నాం.
”బుతు శబ్దం ప్రత్యేక కాలాన్ని సూచిస్తుంది. బుతువ్ఞలు అంటే ”కాలపురుషుని అంగములు. ప్రకృతికి, జీవ్ఞనికి మధ్యనగల సంబంధాన్ని నిర్ణయించేది ”కాలం. ఈవిషయాలన్నిటినీ శ్రుతి, స్మృతి, పురాణ, శాస్త్ర, విజ్ఞాన, వాజ్ఞ్మయం పేర్కొంది. బుగ్వేదంలో ”బుతురాజోవసంతః అన్నారు. వసంతకాలంలో ప్రకృతి నవచైతన్యంతో వెల్లివిరియడం వల్ల ఈ కాలమే నూతన సంవత్సర ఆరంభమని ”ప్రముఖ జ్యోతిర్వేత్త వరాహమిహిరుడు క్రీ.శ. నాలుగవ శతాబ్దంలోనే నిర్ణయించారు. ”ఉగాది అంటే అభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణ, ఉగాది పచ్చడిని సేవించడం, పంచాగశ్రవణం, అనే విధులనే లెక్కిస్తారు. కానీ, ధ్వజారోహణం, ఛత్ర-చామర సేకరణ, ప్రపాదాన ప్రారంభం, రాజ దర్శనం, వసంతరాత్రుల నిర్వహణ వంటివి కూడా ఆచరించవలసిన విధులలో ముఖ్యమైనవి. ఈ రోజున వినాయకునితో ప్రారంభించి, బ్రహ్మాది సకలదేవతలనూ పూజించాలని, అలా చెయ్యడం వల్ల సకల శుభాలూ, సంవత్సరమంతా చేకూరుతాయని, శాస్త్రాలు తెలియ జేస్తున్నాయి. బ్రహ్మదేవ్ఞడు సృష్టిని ప్రారంభించిన రోజు కాబట్టి, ఈరోజున ఆయనను దవనంతో పూజించాలట. దవనం శారీరక తాపం నుండి ఉపశమనం కలిగించి ఆహ్లాదాన్నిస్తుంది. అలాగే మల్లెలు కూడా ఇప్పుడే పూస్తాయి. మన్మధుడిని, అమ్మవారిని, మల్లెలతోను, విరజాజులతోను పూజించాలి. ఇంటిముందు ఒక కర్రను పాతి దాన్ని పూలు, పసుపు-కుంకుమలతో అలంకరించి పూజిస్తే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. దీన్ని ”బ్రహ్మ ధ్వజం లేక ఇంద్ర ధ్వజం అంటారు.
మహారాష్ట్రలో ఇంటిముందు వెదురు కర్రకి పట్టుబట్టను చుట్టి, పూలతో అలంకరించి పైన వెండి, లేక కంచు పాత్రను బోర్లిస్తారు. దీన్ని ”గుడి పడ్వా పేరుతో పిలుస్తారు. ఒకనాడు తెలుగునాట కూడా ఈ సాంప్రదాయం ఉండేదట! రాబోయేది వేసవికాలం కాబట్టి, గొడుగులు, విసరకర్రలు సేకరించి జాగ్రత్త పెట్టుకోవడం ”ఛత్ర-చామర సేకరణ పూర్వకాలంలో కరెంటు, ఫాన్లు, ఏ.సిలు లేవ్ఞ కదా? ఇప్పుడైనా కరెంటు కోత అయితే విసనకర్రనో, పేపర్నో, పుస్తకాన్నో, ఆశ్రయించి విసురుకోవలసిందే కదా? ముందుగా సేకరించి పెట్టుకోవడం మంచిదే! వేసవిలో దాహార్తులకు నీరు ఇవ్వడం మహాపుణ్యప్రదం. అనేక పురాణాల్లో చెప్పింది ఇదే. సంవత్సరం మొదటిరోజునే ఒక మంచిపని చెయ్యాలి కాబట్టి ఉగాది నాడే చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇతరుల అవసరాలను తీర్చడం దీంట్లోని పరమార్థం. ఇక ఉగాది పచ్చడి ప్రత్యేకతే వేరు. షడ్రుచుల సంగమం అయిన దీన్ని సేవిస్తే, ఎంతో ఆరోగ్యం సమకూరుతుంది. వేపపువ్ఞ్వలో క్రిమిసంహారక గుణాలున్నాయి. వేపపూతను నమిలితే, కుష్టు, మధుమేహం, క్షయ, దగ్గు, జలుబు, ఒంటిపూత, జలుబు, జ్వరం, అమ్మవారు, ఒంటిదద్దుర్లు మొదలైన లక్షణాలు తగ్గుతాయి.
మామిడి ముక్కలు రక్తప్రసరణ దోషాలను నివారిస్తాయి. వేడిని తగ్గించి, శరీరానికి చలువనిస్తాయి. గొంతురోగాల్ని, చిగుళ్లువాపుని, నోటిపూతను, వడదెబ్బను, అతి దాహాన్ని పొగడతాయి. చింతపండు వాతరోగాన్ని హరిస్తుంది. మూత్రపిండాలలోని రాళ్లను కరిగిస్తుంది. అరుచిని పోగుడుతుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. ”బెల్లం ధాతు వృద్ధినిస్తుంది. రక్తహీనతను పోగొడుతుంది. వాత, పిత్త, కఫ, దోషాల్ని పోగొట్టి ఆరోగ్యానిస్తుంది. పచ్చిమిరపలో వాతాన్ని పోగొట్టే గుణం ఉంది. ఉప్పు అజీర్ణాన్ని పొగొడుతుంది. వీటన్నిటి కలయికయే ”ఉగాది పచ్చడి కాబట్టి ఈరోజునే ప్రారంభించాలి. పంచాంగ శ్రవణం తిథి వల్ల సంపద, వారం వల్ల ఆయుష్యం, నక్షత్రం వల్ల పాపపరిహారం, యోగం వల్ల వ్యాధి నివృత్తి, కరణం వల్ల కార్యానుకూలత కలుగుతాయని ఉగాది రోజున పంచాగం శ్రవణం చేసిన వారికి ”సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు వైభవాన్ని ”కుజుడు శుభాన్ని, ”శని ఐశ్వర్యాన్ని, ”రాహువ్ఞ బాహుబలాన్ని, ”కేతువ్ఞ ఆధిక్యాన్ని కలుగజేస్తారని అంటారు. ఈనాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలితాన్నిస్తుందట. ఈరోజున ఎలా గడిస్తే,సంవత్సరమంతా అలాగే గడుస్తుందని ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని పెట్టుకొని మంచిని ఆచరిస్తూ, మంచి ఫలితాలను పొందవచ్చు.
ఉగాది కథ
చైత్ర శుక్ల పాడ్యమి నాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని నారద పురాణంలో వివరించారు. వసంతం రుతువు ప్రారంభమైన చైత్రశుక్ల పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా ప్రజాపతి బ్రహ్మ ఈ రసజగత్తును సృష్టించాడని అంటారు.
చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని నారద పురాణంలో వివరించారు. వసంతం రుతువు ప్రారంభమైన చైత్రశుక్ల పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా ప్రజాపతి బ్రహ్మ ఈ రసజగత్తును సృష్టించాడు. కాల గణన, గ్రహ నక్షత్ర, రుతు, మాస వర్షాలను, వర్షాధిపులను ప్రవర్తింపజేశాడు. కాలగమనంలో మార్పులు సహజం. కల్పంలో యుగాలు. ఈ యుగాలు మారేకొద్దీ ధర్మాలు కూడా మారుతాయి. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి. ఆయా పేర్లను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించి చెప్పవచ్చు. తెలుగు సంవత్సరాలు 60. ప్రభవతో మొదలై అక్షయతో ముగిస్తే ఒక ఆవృతం పూర్తయినట్లు. మళ్లీ తిరిగి ప్రభవతో ఆరంభమవుతుంది. ఈ పేర్ల వెనుక భిన్న వాదనలు ఉన్నాయి. ఓ పురాణ కథనం ప్రకారం శ్రీకృష్ణుడి 16100 మంది భార్యల్లో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం. వారి నామాలనే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు. నారదుడి పిల్లల పేర్లు వీటికి పెట్టారనే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దక్షుడు కుమార్తెల పేర్లుకూడా ఇవేనని అంటారు.
కాలమానంలోని అంశాలన్నింటిని పూర్తిగా ఖగోల శాస్త్రరీత్యా పురాతన భారతీయులు నిర్ణయించారు. కాలమాన అంశాలైన రోజు, వారం, పక్షం, కార్తె మాసం, రుతువు, అయనం, సంవత్సరం, పుష్కరం, శకం, యుగం, కల్పకం మొదలైన అన్నింటినీ ఖగోళ శాస్త్ర ఆధారంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఖగోళపరమైన కాలమానాన్ని పురాణకాలం నుంచి ఆచరించడం భారతీయుల ఘనత. ఇది మన భారతజాతి కాలమాన పరిజ్ఞానానికి ఉన్న అవగాహనను తెలిజేస్తుంది. అంతేకాదు మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా ఉంది ఉగాది.
ఉగాది తెలుగువారికి ముఖ్యమైన పండగ.. దీనిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెలుగు వారు చాంద్రమానాన్ని అనుసరిస్తారు. కాబట్టి ఇది చైత్ర మాస చైత్ర మాస శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఈరోజున పంచాంగ శ్రవణం, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ని తినడం ప్రశస్త్యమైంది. మహిళలు ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్ని రుచుల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జరుపుకుంటారు.
కొత్త ఆశలతో ఉగాది
వసంత బుతువు ఆగమనంతో ప్రకృతి శోభ ద్విగుణీకృతం అవ్ఞతుంది. కోయిలలు కుహుకుహుగానాలు మృదుమధురంగా చెవ్ఞలకు ఆహ్లాదాన్ని కలిగి స్తాయి. పంట చేల పచ్చదనాల పరవళ్లు, చెట్లు చేమలు అన్నీ లేలేత ఆకులతో చివ్ఞళ్లు వేస్తుంటే మేమేమన్నా తక్కువా అని పూవనాలు రంగురంగుల పూలతో సువాసనాభరిత వర్ణాలను చిందిస్తాయి. మామిడిపూత కాయలు పిందెలుగా రూపాంతరం చెంది నిండుగా చెట్లకు విరగకాస్తాయి. వేపచెట్లకు వేపపూత నిండుగా చేరి శోభాయమానంగా కనిపిస్తాయి.
ఎటు చూసినా పచ్చదనమే. సుమ సౌరభమే. అదే వసంత రుతువ్ఞ ప్రత్యేకత. అప్పటివరకు మొగ్గవేయని చెట్లు కూడా మొగ్గతొడిగి, గుబురుగా పూలతో విరబూస్తాయి. లేలేత ఆకులతో వృక్షాలు చిగిర్చినిండుగా కనిపిస్తాయి. అందుకే వసంత రుతువ్ఞను రుతురాజుగా అభివర్ణించారు కవ్ఞలు. ఒక మాటలో చెప్పాలంటే ప్రకృతి శోభ మన మనసుల్ని గిలిగింతలు పెట్టి ఆహ్లాదాన్ని అందిస్తుంది. హోలీ పున్నమి సందడికి పులకించిన ప్రజలు ఉగాది ఆగమనానికి నిరీక్షిస్తున్నారు.
ఈ ఉగాది ‘శ్రీవికారి' పేరుతో వస్తోంది కనుక మనందరికీ అన్ని విధాలా ఆనందాన్ని, ఆప్యాయతల్ని అందించాలని ఆకాంక్షిద్దాం. ఉగాది అంటే యుగ ఆది. సృష్టి ప్రారంభం అయిన రోజు. బ్రహ్మ సృష్టిని ఈరోజే సంకల్పించి సృష్టి చేశాడని తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలో బార్హస్పత్యమానం. దక్షిణ భారతదేశంలో సౌరమానం, చాంద్రమానం గణనకు తీసుకుంటారు. చంద్రమానం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి వసంత రుతువ్ఞను ఉగాదిగా పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, పంజాబ్‌లలోనే కాకుండా మారిషస్, బాలి, ఇండోనేషియాల వంటి విదేశాలలో కూడా ఉగాదిని జరుపుకోవటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో ఉగాదిగా, కర్ణాటకలో బేవ్ఞబెల్లగా, మహారాష్ట్రలో గుడిపాడవాగా, రాజస్థాన్‌లో తప్నాగా, సింథ్‌లో చేతిచాంద్, మణిపూర్‌లో సబ్బునోగ్మాగా ఉగాది పండుగను పిలుస్తారు. పేరేది అయినా జరుపుకొనే వారి ఆనందం ఒక్కటే. ఉగాది వస్తోందంటేనే ముందురోజు నుండి సందడి ప్రారంభం. ఇళ్లన్నీ శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి పూలతో మామిడాకు తోరణాలతో అలంకరిస్తారు.
ఉగాది పచ్చడికి వేపపూత, కొత్తబెల్లం, కొత్త చింతపండు, మామిడిముక్కలు సిద్ధం చేసుకుంటారు. అభ్యంగన స్నానానంతరం దేవాలయం దర్శనం ఉగాది పచ్చడి తిని పిండివంటలతో భోజనాలు చేసి సాయంత్రం ఆలయాల్లో జరిగే పంచాంగ శ్రవణానికి వెళతారు. ఆ సంవత్సరం వారి నక్షత్రరాశులకు శుభాశుభ ఫలితాలు, ఆదాయవ్యయాలు ఎలా ఉన్నాయనే అంశాన్ని వినేందుకే ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఉగాది సందర్భంగా కవిసమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఉగాది పండగ సందర్భంగా ప్రత్యేకంగా పిండివంటల్ని సిద్ధం చేస్తారు. ముఖ్యంగా పులిహోర, బొబ్బట్లు సిద్ధం చేస్తారు. బొబ్బట్లను పోలీలని కూడా పిలుస్తారు. కర్ణాటకలో పోలీలను హోలిగె అని పిలుస్తారు. ఉగాది జీవితానికి ప్రతీక.
ఆనందం, విచారం, కోపం, భయం, ఆశ్చర్యం, ద్వేషం, సుఖం, దుఃఖం కలగలిసిన భావమిశ్రమం జీవితం. ఉగాది పచ్చడి కూడా జీవితంలోని చేదు, తీపి సంఘటనలకు ప్రతీకగా చెప్పవచ్చు. వేపపువ్ఞ్వ వగరు, బెల్లం తీపి, ఉప్పు, చింతపండు మామిడిముక్కలలోని పులుపు ఇలా అన్నింటినీ కలిపి తియ్యతియ్యని, పుల్లపుల్లని ఉగాదిపచ్చడి లాగే మన జీవితం కూడా తీపి చేదు అనుభవాల మిశ్రమం అని చెప్పేందుకే. సుఖాన్ని ఆనందంగా ఎలా అనుభవిస్తున్నామో దుఃఖం, కష్టం వచ్చినపుడు కూడా స్థితప్రజ్ఞతతో గుండె ధైర్యంతో మనోనిబ్బరంతో బ్రతికితేనే జీవితం వసంత రుతువ్ఞలాగా ఎప్పుడూ నందనవనంగా విరాజిల్లుతుంది.
మన పూర్వీకులు అందించిన ఆచారాల వెనుక వైద్య రహస్యం అంతర్లీనంగా దాగి ఉంటుంది. ఉగాదిపచ్చడిలో వాడే వేప చర్మవ్యాధుల నివారణకు, చింతపండు అజీర్ణానికి, మామాడి వికారం పోయేందుకు ఇలా వీటన్నిటి మిశ్రమాన్ని తినటం వలన శరీరంలో చేరిన మలినపదార్థాలు పోయి అజీర్ణం హరించబడి ఆరోగ్యం చేకూరుతుంది. వసంతంలో కొత్త చింతపండు, చెరకు, కొత్తబెల్లం, పంట చేతికి అందుతుంది. కొత్తగా వచ్చిన ఈ వస్తువ్ఞలలో తాజాగా పచ్చడి చేయటం వలన మరింత రుచికరంగా ఉంటుంది.
ఈ పండగలు స్తబ్దుగా, ఒకే మూసలో పోసినట్టు రొటీన్‌గా సాగే జీవితంలో పునరుత్తేజానికి, జీవితంలో కొత్త ఆశలు చిగురించేందుకు, మానసిక ఆనందాభివృద్ధికి, సృజనాత్మ కతకు దోహదం చేస్తాయి. పరస్పరం పండుగల సందర్భంగా ఇరుగు పొరుగువారితో, బంధువ్ఞలతో, స్నేహితులతో కలిసిమెలిసి గడపటం వలన స్నేహబాంధవ్యాలు బలపడతాయి. మనిషి సంఘజీవి మనం ఒకరికి సహాయంచేస్తే మనకూ ఎవరైనా సహకరిస్తారు. హద్దుదాటని వైఖరితో స్నేహసంబంధాల వలన మన జీవితాల్లో సహాయ సహకారాలకు కొదవ ఉండదు. ఈ పండుగల వలన మన పరిచయాలు, స్నేహాలు మరింత పటిష్టపడి మనలో ఆత్మస్థయిర్యం పెరుగుతుంది. ఉగాదిపండగ చాంద్రమాన, సౌరమాన, బార్హ స్పత్యమానముల ప్రకారం నిర్ణయించబడుతుంది. అందుకే అందరికీ ఒకేసారి ఉగాదిరాదు.
చంద్రుని గమనాన్ని బట్టి చంద్రమానం, సూర్యగమనాన్ని బట్టి సౌరమానం, బృహస్పతిని అనుసరించి బార్హస్పత్యమానం నిర్ణయించబడ్డాయి. బృహస్పతి అంటే గురువ్ఞ. గురువ్ఞ ఒక్కొక్కరాశిలో ఒక సంవత్సరం ఉంటాడు. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతీయులు చైత్రశుద్ధ పాడ్యమినే సంవత్సరాదిగా జరుపుకుంటారు. ఈ ఉగాది శుభదినాన శ్రీమహావిష్ణువ్ఞ మత్స్యావతారంలో రాక్షసులచే దొంగిలించబడిన వేదాలను బ్రహ్మకు అప్పగించి సృష్టిని సాగించమని తెలిపినట్టు ఐతిహ్యం. ఉగాదిరోజున తైలాభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పంచాంగాన్ని, సంవత్సరాదిన దేవతలను పూజిస్తారు. వ్యాపారస్తులు కొత్తగా లెక్కలు ప్రారంభించి నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఈరోజున పంచాంగం శ్రవణం గంగాస్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని పురాణాల ద్వారా అవగతమౌతోంది. మనకున్న ఆరు రుతువ్ఞలు ఆరు ధర్మాలతో ఉన్నాయి.
వీటిలో కొన్ని సుఖానికి, మరికొన్ని దుఃఖానికీ కారణమౌతాయి. సుఖాలకు ఉప్పొంగక, కష్టాలకు కృంగక ధైర్యంగా ఉండటం అలవరచుకోవాలని షడ్రుచుల ఉగాదిపచ్చడి సందేశం. అభ్యంగనం: ఉగాది వంటి పర్వదినాల్లో మహాలక్ష్మి నూనెలోనూ గంగాదేవి జలాలలో అవతరిస్తారని ప్రతీక. నువ్ఞ్వలనూనెతో శరీర, శిరోమర్దన వలన ఉష్ణం హరించి శీతల సుఖం లభిస్తుంది. నాడీమండలం, నేత్రాలు పుష్టిని పొందుతాయి. కొత్త బట్టలు ధరించి మొట్టమొదట ఉగాదిపచ్చడి భుజించాలి.
పంచాంగ శ్రవణంలో తిథి వలన సంపద, వారం వలన ఆయుష్షు, నక్షత్రం వలన పాపపరిహారం, యోగం వలన వ్యాధినివృత్తి, కరణం వలన కార్యానుకూలత కలుగుతాయి. అంతేకాక సంవత్సరాధిపతులైన రాజాధి నవనాయక గ్రహఫలితా శ్రవణం వలన ఆరోగ్యం, ఆయుష్షు, సంపద వృద్ధి చెందుతాయి. శ్రీరాముడు త్రేతాయుగంలో ఉగాదినాడే రాజ్యాన్ని స్వీకరించాడు. విక్రమార్క చక్రవర్తి, శాలివాహన చక్రవర్తి ఈనాడే పట్టాభి షిక్తులైనారని, కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సంహార అనంతరం ధర్మరాజు సింహాసనాన్ని ఈరోజే అధిష్టించాడని చరిత్ర చెబుతోంది. ఈరోజు దవనంతో బ్రహ్మను పూజిస్తే శుభం సిద్ధిస్తుంది.
ఏ ప్రాంతంలో ఏనాడు జరుపుకున్నా ఉగాది వసంతాగమన సూచిక. మానవ జీవనగమనంలో నూతన శుభారంభానికి జీవనోల్లాసానికి సంకేతం. అందుకే ఈ శ్రీవిళంబి నామ సంవత్సర ఉగాదిని మనందరం దిగ్విజయంగా జరుపుకుని ఆనందోత్సాహాలతో జీవన గమ్యాన్ని సుగమం చేసుకుందాం.