ఓ నరుడా! నీవు పామరుడవు కావే
#####################
వికృత చేష్ఠ పాపం అదిఎట్లనన్
ఓ సద్విమర్శ మనిషి ని పిచ్చోడిని చేయున్!
దాడి ఘోరం అది ఎట్లనన్ !
ఓ సహేతుక సూచన మనిషిని చితకకొట్టుడు చేయున్,!
అర్ధం అయినదా ఓ నరుడా!
నీవు పామరుడవు కావే ?
ఓ ఆవేదన నిన్ను మంచి చేయమని కోరు
అది అవహేళన కాదే ?
ఓ ఆలోచన నిన్ను జాగు చేయడానికి పురిగొల్పు
అది పరనింద కాదే ?
అది మరిచి
లోపం గా భావించి కోపంతో
రగిలిపోతూ,ఊగిపోతూ ఆంబోతు లా అబల,సబలల మీద పడి రెచ్చిపోతే
కడకు పుచ్చిపోయేది ఎవరు ఓ మూర్ఖుడా??
హాయిగా సాగి పోతున్న నీ జీవితానికి ఓ పరాజయం ,
ఒక అలసత్వం నీ పతనం
ఒక అహంకారం అంధకార బంధనం
నీ పనికి నీ వారు వంచక తప్పలేదు తలలు
నీవు నేర్చిన విద్యలు ఏంఅయ్యాయి
నీ సంస్కారం శ్మశానంలో కలసి మసి అయ్యే ఓరి మాయదారి
అతిగా ఆవేశం పడ్డ మగవాడు సమాజానికి పగవాడు,బాగుకాడే
నీ హోదా గోదారి లో జారిపోయే
నీకు దండం పెట్టే చేతులు దండెత్తి వచ్చే
అరదండాలతో అల్లరి పాలై నిలువునా మునిగిపోయిన మూర్ఖపు శిఖా
ఒక క్షణం సహనం అనే రక్షణ కవచాన్ని మరిచి
అనాలోచితంగా ముందుకు పోతే ఇలాంటివే దాపురించున్
*** చురకశ్రీ***
సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ కావలి