ఆమె....
బంధాలకు బహుమానం,
ఆనందాలకు నిలయం,
బాధ్యతలకు బంధనం,
ఆత్మీయతకు ఆవాసం,
అనురాగానికి అమృతం,
కుటుంబానికి ఆధారం.....!
ఆమె....కుటుంబంలో..
బిడ్డకు ఆకలిని తీర్చి,
భర్తకు సేవలు చేసి,
మిత్రునిలా ఆపదలో ఉండి,
గురువులా క్రమశిక్షణను నేర్పి,
అమ్మలా అందరిని లాలించి,
రాజులా కుటుంబాన్ని పాలించి,
ఇంటికి దీపంలా నిలిచి....!
ఆమె....సమాజంలో..
ఉన్నతమైన ఉద్యోగి,
అహర్నిశల శ్రమజీవి,
పాలకుల ప్రతినిధి,
పాలితుల ఆశాజీవి,
బాధ్యతల పెన్నిధి,
కళలకు కాణాచి,
ప్రపంచానికి ఆదర్శానివి,
సృష్టికి ప్రతిరుపానివి....!
మరీ....మరీ....
ప్రపంచ రంగస్థలంలో
ఇన్ని పాత్రలు పోషించే
పవిత్రమూర్తికి,
శక్తి స్వరూపినికి,
ఎందుకు అవమానాలు,
దేనికి భృణహత్యలు,
ఏంటి ఆత్మహత్యలు,
ఏంటి చీదరింపులు....
ఆలోచించండి.....
ఆచరించండి......
స్త్రీ శక్తిని గుర్తించండి,
స్త్రీని గౌరవించండి..
💐💐💐ప్రపంచ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు💐💐💐
వెంకటేశ్వర్లు.కె
తెలుగు ఉపాధ్యాయులు