స్త్రీ వివక్ష
🌹💎🎈🌟
బస్సు కోసం రోడ్డు మీద నిలబడ్డారు ఒక దంపతుల జంట, చాలీచాలని పంచెకట్టులో మాసిన పైగుడ్డతో అతడు; చిరిగిన పాత చీరలో ఆవిడ.
అంతలో బస్సు వచ్చింది.
ఇద్దరూ ఎక్కేశారు. కండెక్టరు వచ్చి టికెట్ కోసం డబ్బులు అడిగితే...
"బాబూ! విజయనగరానికి టిక్కెట్ ఎంత?"
అంటూ అడిగాడు.
"అయిదు రూపాయలు,
తొందరగా డబ్బులు తియ్ "
అన్నాడు కండక్టర్. సంచిలోంచి డబ్బులు తీస్తూ...
"మరి మా ఆడదానికెంత బాబూ?" అంటూ అడిగాడు
బస్సులో జనం అందరూ గొల్లున నవ్వారు.
"నీకో రేటు మీ ఆడదానికో రేటు వుండదయ్యా పది రూపాయలు తియ్"
అన్నాడు కండక్టర్ విసుగ్గా.
పది రూపాయలు తీసి కండెక్టర్
చేతిలో పెడుతూ , బస్సులోని జనం వంక తిరిగి
"నవ్వకండి బాబులూ...
_నాకు తెలియక అడిగినాను...._
_ఎందుకంటే పొలంలో ఎవసాయ పనికి వెళ్ళి ఇద్దరం సమానంగానే వరి నాట్లు వేస్తాం, కానీ నాకు యాభై రూపాయలు ఇచ్చి మా _ఆడదానికి మాత్రం పాతిక రూపాయలే ఇస్తారు...!_
ఇక్కడ కూడా అలాంటిది ఉంటాదేమోని అడిగాను బాబూలు...!"
అన్నాడు అమాయకంగా.🙏
...........................................
( స్త్రీ వివక్షపై నేను చదివిన కథల్లో ఓ మంచి కథ )