"సర్వేజనా సుఖినో భవంతు"
***
మహాశివరాత్రి శుభాకాంక్షలు
***
హరహర మహాదేవ శంభోశంకర అందుకోవయ్యా జనాల అంజలి..
****
ఎందుకయ్యా నీవు అక్కడ చితిమంటల వద్ద శ్రీకంఠా!
అందరూ విలాసవంతమైన భువన భవనాల్లో ఉండ
ఎందుకయ్యా బూడిద రేణువుల గుట్టల వద్ద నీలకంఠా!!
అందరూ మిట్టల్లో కొలువై పూజలు అందుకుంటూ ఉంటే
ఎందుకయ్యా అర్ధమొల ధరించి ఉంటావు అజా!
అందరూ సంపూర్ణ సొగసైన వస్త్రాభరణాలు ధరించి ధగధగలాడుతుంటే
ఎందుకయ్యా నీ మెడలో సర్పం ఎంత ఒకవేళ కంఠంలో కాలకూటం దాచుకున్న నాగభూషణా!!
అందరూ వజ్రవైడూర్యాల కిరీటాలు ధరించి దర్శనాలు ఇస్తూంటే;
ఎందుకయ్యా నీకు ఎల్లప్పుడూ నంది కాపలా కాపురం ఏం పాపం చేశావు అయ్యా! త్రిశూల!
అందరికీ లేదే ఈ అవస్థ జగదీశా!!
ఎందుకయ్యా ఊరికి ఆవల నీవు కపాలి!!
అందరూ ఊరిలో ఇలాఖా ఉంటే;
అందరికి నీరు ఇచ్చావు, నీ ప్రియ గంగను మోస్తున్నావూ గంగాధర!!
అందరికీ కాలకూటం నుంచి ప్రాణాలను కాపాడుతున్నా నీవు ఏమో అంటరానివాడవు అయ్యావూ త్రిలోకపతి!!
శిగలో ప్రకాశించే చంద్రవంకతో శవాలను కాపాలకాస్తూ,
నీ నృత్యంతో ఆత్మలకు ఆనందభరితం చేస్తున్నా నిను అల్లంత దూరం ఉంచారయ్యా చంద్రపాలా!ఓ నటరాజా!!
నీ పంచన చేరి నీ భజన చేస్తూ కీర్తిస్తూ నిన్నే కోరికలు కోరి ఫలాలు పొందుతారయ్యా ఓ భోళాశంకరా! ఓ హరా!!
నీ ఆజ్ఞ లేకుంటే చీమైనా కుట్టదు అంటారే? అయినా ఎన్నెన్నో ఘోరాలు, మోసాలు జరుగుతూ ఉన్నాయి కద అయ్యా! సర్వేశ్వరా!!
ఓ వైపు పాపాల పుట్టలు గుట్టలు గా చేరిపోతున్నా నీవు పట్టనట్లు ఉంటే ఎలా చెప్పవయ్యా పరమేశ్వరా!!
నీ రాత్రి జాగరం చేస్తే చాలు పాపకర్మలు పోవు అనుకుంటూన్నారయ్యా ఈ జనాలు ఓ కైలాసగిరి వాసా!!
ఆ విడిది వదలి మానవనివాస సన్నిధి చేరి నీ శివతాండవంతో పాప పరిహారం చేయవయ్యా!లోకంకరుడా!! ఓ జీవ్వేశ్వరా!!అక్షయగుణధరా!!
రచన...చురకశ్రీ