*కవిసామ్రాట్ విశ్వనాధసత్యనారాయణ గారి జయంతి
కవిసామ్రాట్...!!
సాహితీ జగత్తులో విరాట్ మూర్తి
అన్ని ప్రక్రియల్లో అందెవేసిన శక్తి
అక్షర యజ్ఞములో పట్టిందల్లా బంగారం
రాసిందల్లా మహా కావ్యంగా వెలుగొందే...
ప్రతి రచనలోను వ్యక్తిత్వం ప్రతిబింబిస్తూ
వాక్కులతో అమృతం కురిపిస్తూ
వాక్యాలలో వసంతాన్ని పూయిస్తూ
శబ్దాలలో నాదస్వరాన్నీ వినిపించే..
అక్షరాలతో సమన్వయం సాధిస్తూ
భావంలో బాధ్యతలను పెంచుతూ
భావనలో ఆదర్శాలు నింపుతూ
తెలుగు నేలపై కావ్యాలెన్నో ఉద్భవించే..
దర్శనములో దర్శకత్వం వహిస్తూ
కావ్యాలలో కర్తవ్యం బోధించి
రామాయణ కల్పవృక్షం వినసొంపుగా రాసి
ఆధ్యాత్మిక ఆనందాన్ని నలుదిశాల పంచిపెట్టే...
నవలలో నూతనత్వాన్ని సృజించి
శతకాలలో సుభాషితాలను కురిపించి
నాటకాల్లో నవరసాలు పండించి
కథా కవనంలో రమణీయంగా రాణించే..
మహాకవిగా మనుగడ సాగించి
బ్రహ్మ తేజస్సుతో కవితలు సృష్టించే
అక్షరాలను అద్భుతంగా ప్రయోగించి
సరస్వతి కటాక్షం పుష్కలంగా పొందే..
సృజించని అంశమంటూ ఏదీ లేదు
అక్షర సొగసు ప్రతి రూపానికి కల్పించి
ప్రాచీన నవ్యత ప్రఖండ సాహిత్య సవ్యసాచి
నిర్మొహమాటంగా మాట్లాడే సత్యమూర్తి..
ఉపాధ్యాయునిగా విజ్ఞాన ప్రదాతగా
కవి సామ్రాట్ బిరుదాంకితుడై
కళాప్రపూర్ణ పద్మవిభూషణ్ అలంకరించి
తెలుగువారికి జ్ఞానపీఠ అందించే...
తెలుగు భాషమ్మ తల్లి ముద్దుబిడ్డగా
సాహిత్యములో అందెవేసిన విజ్ఞాన గని
సాహితీ వినీలాకాశములో ధ్రువతారలా వెలుగుతూ
అమృత బిందువుల్లో తాను ఒక బిందువై నిలిచే..
✍
కొప్పులప్రసాద్
నంద్యాల
9885066235