కాళోజీ జయంతి...
తొలి పొద్దు కేక.. అతను
తెలంగాణ తొలి పొద్దు కేక అతను
తెలుగు భాషను వినూత్నంగా మలిచి
జనం భాషకు తోడుగా నిలిచి
మాట్లాడే భాషకు ప్రాణం పోసే..
వాడుకభాషే మన భాష అంటూ
ప్రజల మనిషిగా వెలుగొందే
ప్రజా శ్రేయస్సుకు కవితలను అర్పించే
సాహిత్యానికి కొత్త రెక్కలు తొడిగే...
ప్రజల ఉద్యమ ప్రతిధ్వనిగా నిలబడే
ప్రజలగొడవే తనగొడవగా భావించే
పాలకులపై కవితాస్త్రాలను ప్రయోగించే
అసలు సిసలైన తెలంగాణ వాదిగా వెలిగే..
అక్షర సత్యాలను సంధించిన ప్రజాకవి
రాజకీయసాంఘీక సమాహార వ్యవస్థలో
చైతన్య అక్షర రూపమై ప్రకాశించే
వ్యంగ్య కవిత్వము తో చురకలు అంటించే..
తెలంగాణయాసకు భాషను మలిచే
తెలుగును విజయోత్సవాలలో నిలిపే
ఎన్ని భాషలు నేర్చినా తెలుగు జై కొట్టే
వాడుకభాషలోనే సంభాషణ గావించే..
తెలంగాణే ఊపిరిగా కదిలిన మహామనిషి
తెలంగాణ భాషకు కనకాభిషేకం చేసేను
పుట్టుక చావు నీది బ్రతుకంతా దేశానిది అనే
వెలిగెత్తి చాటిన కోటి గొంతుల నినాదం అది..
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235