పసి(డి) హృదయాలు..
అంశం: బాలగేయం
రచయిత పేరు: రేజేటి వేంకటరమణమూర్తి; కలంపేరు: అమరశ్రీ...✍️
ఊరు: టెక్కలి; శ్రీకాకుళం జిల్లా.
శీర్షిక: బాలల భవిత బంగారం🏆
బాల లందరు ప్రతి దినమండీ
బడులకు పోయి చదవాలండీ
బాధ్యత గాను మెలగాలండీ
బంగరు భవితను పొందాలండి
బద్దక మన్నది విడవాలండీ
భయమన్నది వదలాలండీ
బడినే గుడిగా తలవాలమడీ
బడిలో అందరు కలసుండండి
బట్టీ పద్ధతి మానేయండి
బాగా ఆలోచన చేయాలండీ
భక్తితో దేవుని కొలవాలండీ
భవిష్యత్తు మీదే పరుగెత్తండి
భావి భారత పౌరులు కండి
బ్రహ్మ రాతను మార్చేయండి